Thursday, April 25, 2024

సీజ్ చేసిన వాహనాలు వెనక్కి

- Advertisement -
- Advertisement -

 

రూ.500 జరిమానాతో సరి
భద్రత భారం కావడంతో నిర్ణయం
ఇప్పటికే 34వేల వాహనాలు రిలీజ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు లక్షల వాహనాలను సీజ్ చేశారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌లో 34 వేల టూవీలర్లను పోలీసులు వెనక్కి సీజ్ చేసిన వాహనాలు వెనక్కి ఇచ్చేశారు. వాహనాలపై గతంలో నమోదైన చలానాలను చెల్లించుకొని యజమానులకు తిరిగి ఇచ్చేయనున్నారు. మొదటిసారి చలానా పడిన వాహనాలపై సెక్షన్ 179 కింద కేసు నమోదు చేసి రూ. 500 జరిమానా కట్టించుకొని వెనక్కి ఇచ్చేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో మీ సేవతోపాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లించేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐపిసి 118, 207 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద సీజ్ చేసిన వాహనాలను తీసుకోవడానికి మాత్రం న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వాహనాలను తిరిగి ఇచ్చేస్తామని పోలీసులు గతంలో ప్రకటించారు. కానీ వాటి భద్రత తలనొప్పిగా మారడంతోపాటు వాహనదారులు రిక్వెస్ట్ చేస్తుండటంతో వెనక్కి ఇచ్చేస్తున్నారు.

వాహనాలు విడుదల చేయండి : డిజిపి ఆదేశాలు
లాక్‌డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జప్తు చేసిన వాహనాలను విడుదల చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి శుక్రవారం సాయంత్ర ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాలను భద్రపరచడం సమస్యగా మారడంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాహనాల విడుదలపై డిజిపి మహేందర్ రెడ్డి పలు మార్గదర్శకాలను జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News