Sunday, March 3, 2024

ఈ నెల 27న మేయర్.. ఛైర్ పర్సన్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

election-commission

హైదరాబాద్: మున్సిపల్ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలోనే ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎస్‌ఇసి పేర్కొంది. ఈ మేరకు రాష్ర్టంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన వార్డు సభ్యులు ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరువాత కొత్త పాలకమండలి తొలి సమావేశం నిర్వహించాలని రాష్ర్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఈ సమావేశంలోనే మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటి మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరపనున్నట్లు తెలిపింది. నగర మేయర్, డిప్యూటి మేయర్, మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి ఈ నెల 25 కంటే ముందు లేదా అదే రోజున జిల్లా కలెక్టర్లు అపాయింట్ చేసిన గెజిటెడ్ అధికారి ఫామ్ 2 నోటీసు ఇస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.

మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక తరువాతే డిప్యూటి మేయర్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నెల 27వ తేదీన ఏదేని కారణం చేత ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు 28న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికైన వారిలో ఒక మెంబర్ మేయర్, చైర్‌పర్సన్ క్యాండిడేట్‌ను ప్రతిపాదించాలి, మరో మెంబర్ మద్దతు ఇవ్వాలి. పోటీలో ఒకరే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఎక్కువ మంది ఉంటే చేతులెత్తే ప్రక్రియలో ఓటింగ్‌నిర్వహించి విజేతను ప్రకటిస్తారు.

Selection of Mayor And Chairman on 27th January

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News