Home తాజా వార్తలు రాష్ర్ట స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక…

రాష్ర్ట స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక…

 

మహబూబాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఈనెల 24 నుండి 25 వరకు  జరిగే అండర్-13 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు మహబూబాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ఎంపికయ్యాయని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు పుప్పాల సంజీవరావు, సమ్మెట ప్రేమ్‌కుమార్ తెలిపారు. బాలికల విభాగంలో ఎ.దీపిక, పి.వీణ, వి.నందిని, బి.వైష్ణవి, పి.మానస, ఎ.శ్రావణ్, పి.నందిని, జి.అక్షర, బి.సంధ్య, ఎ.స్రవంతి, టి.స్వప్నిక ఎంపికయ్యారని వారు తెలిపారు. అలాగే బాలుర విభాగంలో ఎ.పృధ్వి, ఎం.గణేష్, ఎస్.ప్రశాంత్, డి.రాజేష్, ఎన్.మహేందర్, ఎస్. యశ్వంత్, ఎ.రామకృష్ణ, పి.నరేందర్, ఎ.సిద్దు, బి.రాంచరణ్, జె.పాండు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను విఎస్ లక్ష్మీపురం జెడ్‌పిఎస్‌ఎస్ హెచ్‌ఎం మందుల శ్రీరాములు, ఎస్‌ఎంసి చైర్మన్ ఎ.యాకాంతం, ఉపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వరవ్లు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.ప్రభాకర్ అభినందించారు.

 

Selection of state level softball competitions