Home తాజా వార్తలు సెల్ఫీల హల్‌చల్

సెల్ఫీల హల్‌చల్

pawan-Kalyanపవన్‌కల్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. సినిమాలో పవన్, హాట్‌బ్యూటీ లక్ష్మీరాయ్ మధ్య ఓ హుషారైన ఐటమ్‌సాంగ్ ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో జరుగుతోంది. పవన్, లక్ష్మీరాయ్‌లు దద్దరిల్లే స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఈ సాంగ్ సందర్భంగా పవన్‌తో లక్ష్మీరాయ్ సెల్ఫీలు తీసుకుంది. ఈ సెల్ఫీలో పోలీస్ డ్రెస్సులో కనిపిస్తున్న పవన్‌తో లక్ష్మీరాయ్ దర్శనమిస్తుంది. ఈ ఫొటో చూస్తే అభిమానులకు ‘గబ్బర్‌సింగ్’లో కెవ్వు కేక… పాట గుర్తుకువస్తుంది. ఈ పాట కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సెల్ఫీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో సెల్ఫీలకు కొన్ని నిమిషాల్లోనే వచ్చిన స్పందన చూసి లక్ష్మీరాయ్ ఎంతో ఆశ్చర్యపడింది. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి శరత్‌మారర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.