Home తాజా వార్తలు మరో సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య

మరో సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య

Journalist-KG-Singh

చండీగఢ్: సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను మరవకముందే మరో సీనియర్ జర్నలిస్టు కెజె సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. మొహాలీలోని ఆయన నివాసంలో కెజె సింగ్‌తో పాటు ఆయన తల్లి గురుచరణ్ కౌర్ (92) కూడా హత్యకు గురయ్యారు. దుండగులు తల్లికొడుకును హత్య చేసి ఇంట్లోనే పడేసి వెళ్లిపోయారు . ఈ జంట హత్యలపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ జంట హత్యలపై విచారణ చేపట్టారు.