Tuesday, February 7, 2023

ఘనంగా సీనియర్ నరేష్ జన్మదిన వేడుక

- Advertisement -

Naresh‘పండంటి కాపురం’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసి ఇప్పటివరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 150కి పైగా చిత్రాలు చేసిన నటుడు సీనియర్ నరేష్. నాలుగు స్తంభాలాట, ప్రేమ సంకెళ్లు, రెండు జెళ్ల సీత, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీనియర్ నటుడు శుక్రవారం హైదరాబాద్‌లో తన పుట్టినరోజు వేడులకను ఘనంగా జరుపుకున్నాడు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ, ‘మా’ అధ్యక్షుడు డా.రాజేంద్రప్రసాద్, కార్యదర్శి శివాజీ రాజా, బి.ఎ.రాజు, వినాయకరావు, హీరోలు సుధీర్‌బాబు, నవీన్, గౌతంరాజు, హేమతో పాటు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ “హీరోగా ఎన్నో సూపర్‌హిట్ ఫిలింస్, హండ్రెడ్ డేస్, సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో నరేష్ నటించాడు. కొంతకాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ‘ఘటన’ చిత్రంలో డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ చేశాడు. అ..ఆ, శతమానం భవతి, దృశ్యం, గుంటూరు టాకీస్ చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. నరేష్ మరిన్ని మంచి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకోవాలి”అని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ “ప్రస్తుతం నటుడిగా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ నరేష్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మా నరేష్ వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు హాయిగా బతకాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ “ఈరోజు నా బర్త్‌డేకు ఒక ప్రత్యేకత ఉంది. నేను దత్తత తీసుకున్న హిందూపూర్, అనంతపురం ప్రాంతాల్లోని ఎంతో మంది కళాకారులు తమ డప్పు వాయిద్యాలతో వచ్చి వారి కళను ప్రదర్శించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. హిందూపూర్‌లో 16 మందితో కళాకారుల ఐక్యవేదిక సంఘాన్ని స్థాపించాం. 11 వేల మందికి పక్కా గృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించాం. 18 వేల మంది కళాకారులను ప్రోత్సహించి ఉపాధిని కల్పిస్తున్నాం. ఇక కెరీర్‌లో మరిన్ని మంచి పాత్రలను పోషించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటాను”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles