Wednesday, April 24, 2024

ఐటీ షేర్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ పతనం

- Advertisement -
- Advertisement -
sensexరాణించిని ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ , పవర్ షేర్లు

ముంబై:  నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86.61 పాయింట్లు లేదా 0.16% క్షీణించి 54,395.23 వద్ద, మరియు నిఫ్టీ 4.60 పాయింట్లు లేదా 0.03% క్షీణించి 16,216 వద్ద క్లోజయ్యాయి. దాదాపు 2035 షేర్లు పురోగమించగా, 1297 షేర్లు క్షీణించాయి , 155 షేర్లు మారకుండా తటస్థంగా నిలిచాయి. నిఫ్టీలో ప్రధానంగా లాభపడిన షేర్లలో  ఐషర్ మోటార్స్, ఓఎన్‌జిసి, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, బిపిసిఎల్, ఇన్ఫోసిస్ షేర్లు  నష్టపోయాయి.

సెక్టార్లపరంగా చూసినట్లయితే ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ , పవర్ సూచీలు 1-4 శాతం పెరగగా, ఐటీ సూచీ దాదాపు 3 శాతం క్షీణించింది. బిఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 నుంచి 1 శాతం మధ్య పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News