Home తాజా వార్తలు మార్కెట్‌కు కరోనా టెన్షన్

మార్కెట్‌కు కరోనా టెన్షన్

Sensex and Nifty ended sharply lower on Monday

 

ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు ఔట్
870.51 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

ముంబై : కరోనా కేసులు పెరుగుతుండడంతో స్టాక్‌మార్కెట్ భారీగా పతనమైంది. ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.16 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఏప్రిల్ 1న రూ .207 లక్షల కోట్లు ఉంది. అయితే సోమవారం పతనంతో రూ.2 లక్షల కోట్లు నష్టపోయి రూ.205 లక్షల కోట్లకు పడిపోయింది. కరోనా కేసులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 870.51 పాయింట్లు అంటే 1.74 శాతం పడిపోయి 49,159.32 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1400 పాయింట్లు పడిపోయి కనిష్ట స్థాయి 48,580కు చేరింది. ఆ తర్వాత కొంత మేరకు పుంజుకుంది. మార్చి 26 తర్వాత మార్కెట్ మొదటిసారిగా ఈ స్థాయికి చేరుకుంది.

బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో భారీ క్షీణత
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం పడిపోయింది. ఇవే కాకుండా మార్కెట్లో అతిపెద్ద షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్‌తో సహా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 6 శాతం వరకు నష్టపోయాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మార్కెట్లు పతనమవుతూనే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది ఆర్థిక కార్యకలాపాలకు సమస్యలను కలిగిస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు అంటే ఎఫ్‌ఐఐలు కూడా గత కొద్ది రోజులుగా పెట్టుబడులను తగ్గించారు. దేశంలోని కర్మాగారాల ఉత్పత్తిని కొలిచే ఇండెక్స్ అయిన తయారీ రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) కూడా ఫిబ్రవరిలో 57.5 నుండి మార్చిలో ఏడు సంవత్సరాల కనిష్టం 55.4కు పడిపోయింది.

అంటే ఆంక్షల వల్ల ఉత్పత్తి కూడా ప్రభావితమైంది. దేశీయ జిడిపిలో ఈ రంగం 15 శాతం వాటా కలిగి ఉంది. ఉపాధి పరంగా కూడా ఇది చాలా ముఖ్యం. ఈ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ చందన్ తపాడియా మాట్లాడుతూ, తిరోగమనం మధ్య పెట్టుబడిదారులు మెటల్, ఐటి, ఫార్మా రంగాల నాణ్యమైన వాటాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఇవి ఇతర రంగాలకన్నా సురక్షితమైనవి. ఐటి, ఫార్మా, స్పెషాలిటీ కెమికల్‌తో పాటు ఎగుమతి రంగాలలో కూడా సానుకూల వృద్ధిని అంచనా వేశారు. ఇదే కాకుండా ఆన్‌లైన్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టాలని కూడా సూచించారు, ఇందులో ఇండియామార్ట్‌తో సహా ఇతర షేర్లు ఉన్నాయి. నిఫ్టీలో ఇండెక్స్ 14,400 కన్నా దిగువకు పడిపోతే, అది 14 వేల స్థాయికి చేరవచ్చని ఆయన అన్నారు.

Sensex and Nifty ended sharply lower on Monday