129 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సిలో అమ్మకాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. అదే సమయంలో అమెరికా జిడిపి క్షీణత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడగా ప్రపంచ మార్కెట్లు నష్టాల వైపు పయనించాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపైనా ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 129.18 పాయింట్లు తగ్గి 37606.89 వద్ద ముగిసింది.
మరోవైపు నిఫ్టీ 28.70 పాయింట్లు తగ్గి 11073.45 స్థాయిలో క్షీణించింది. డాలర్ బలహీనపడడంతో రూపాయి మూడు పైసల లాభంతో 74.81 వద్ద ముగిసింది. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీల షేర్ల కదలికలు కనిపిస్తున్నాయి. ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా స్థాయికి దగ్గరగా నిర్ణయించడంతో ఇది మార్కెట్‌ను ప్రభావితం చేసింది.