Home తాజా వార్తలు రెండో రోజూ నష్టాలు

రెండో రోజూ నష్టాలు

Sensex ended 335 points lower at 37,736

 

335 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో నష్టాలను నమోదు చేశాయి. ఫైనాన్స్, ఎనర్జీ, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ -335.06 పాయింట్లు (-0.88%) నష్టపోయి 37736.07 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిప్టీ -100.70 పాయింట్లు (-0.90%) కోల్పోయి 11102.15 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్రారంభంలో లాభాలతోనే ఆరంభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 100 పాయింట్లు లాభంతో కనిపించింది. కానీ మధ్యాహ్నం తర్వాత సూచీలు కుదేలయ్యాయి.

నిఫ్టీలో ప్రధానంగా భారత్ పెట్రోలియం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ షేర్లు 3 నుంచి 8 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు డా.రెడ్డీస్, సన్‌ఫార్మా, విప్రో, వేదాంత, మారుతీ సుజుకీ షేర్లు 1 నుంచి 5 శాతం మధ్య లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు స్వల్పకాలిక రేట్లను సున్నా నుంచి 0.25 శాతం మధ్య ఉండేందుకు నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించింది.

Sensex ended 335 points lower at 37,736