Home తాజా వార్తలు వీడని కరోనా భయాలు

వీడని కరోనా భయాలు

Sensex

 

మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
1375 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుండడంతో మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 1070.59 పాయింట్లు లేదా 3.59 శాతం నష్టంతో ప్రారంభించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1375 పాయింట్లు 28,440 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 379 పాయింట్లు నష్టపోయి 8,281 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రధానంగా టిసిఎస్, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, యుపిఎల్, విప్రో, ఎన్‌టిపిసి లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఒఎన్‌జిసి, యుపిఎల్, సన్ ఫార్మా, వేదాంత లిమిటెడ్, ఎం అండ్ ఎం, జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టాలతో ముగిశాయి.

రంగాల వారీగా చూస్తే అన్ని నష్టపోయాయి. వీటిలో పిఎస్‌యు బ్యాంకులు, మెటల్, ఫార్మా, ఐటి, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసిజి, మీడియా ఉన్నాయి. కరోనా వైరస్ భారతదేశంలో వ్యాపిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణించిన వారి సంఖ్య 27కి చేరింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం రోగుల సంఖ్య 1047 కు పెరిగింది. ఇందులో 95 మంది రోగులు ఆరోగ్యంగా మారారు. ప్రస్తుతం చేరిన రోగుల సంఖ్య 924. ఈ కారణంగా సెన్సెక్స్-నిఫ్టీ క్షీణిస్తోంది. దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థకు, సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అనేక ప్రోత్సాహక ప్రకటనలు చేశాయి. రెపో రేటు తగ్గింపుతో పాటు రుణ ఇఎంఐ చెల్లింపులో ఆర్‌బిఐ ప్రజలకు మూడు నెలల పొడిగింపు వెసులుబాటు ఇచ్చింది. అయినప్పటికీ దేశీయ మార్కెట్‌లు క్షీణించడం గమనార్హం.

ప్రపంచ మార్కెట్ల పరిస్థితి
శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు కూడా క్షీణించాయి. డౌజోన్స్, ఇతర మార్కెట్లు ఒత్తిడిలో కనిపించాయి. డౌజోన్స్ 4.06 శాతం లేదా 915.39 పాయింట్లు తగ్గి 21,636.80 వద్ద ఉంది. నాస్‌డాక్ కాంపోజిట్ 3.79 శాతం తగ్గి 7,502.38 వద్ద ఉంది. ఎస్ అండ్ పి 3.37 శాతం పడిపోయి 2,541.47 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ నాలుగు శాతానికి పైగా ట్రేడయింది. మరోవైపు హాంగ్సెంగ్, కోస్పి, తైవాన్ సూచీలు కూడా నష్టాల్లో కనిపించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 33 పైసలు పడిపోయి 75.18 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు ట్రేడింగ్ రోజున డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.85 వద్ద ముగిసింది. ప్రీ ఓపెన్ సమయంలో ఉదయం 9:10 గంటలకు స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్ వద్ద ఉంది. సెన్సెక్స్ 589.04 పాయింట్లు లేదా 1.98 శాతం క్షీణించి 29226.55 వద్ద ఉంది.

Sensex ends 1,375 points lower