Home తాజా వార్తలు వరుస లాభాలకు బ్రేక్

వరుస లాభాలకు బ్రేక్

Sensex falls 580 points to close at 43,600

 

580 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. బలహీన అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేయడంతో మార్కెట్లు 1 శాతం మేరకు పతనమయ్యాయి. సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 43,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 12,771 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కంపెనీలలో ఎస్‌బిఐ షేర్లు 5 శాతం పడిపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు కూడా నష్టపోయాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఐటిసి, ఎన్‌టిపిసి, టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మూలధన మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గణాంకాల ప్రకారం, బుధవారం స్థూల ప్రాతిపదికన రూ.3,071.93 కోట్ల విలువచేసే షేర్లను కొనుగోలు చేశారు. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు పడిపోయి డాలర్‌పై 74.27 వద్ద ముగిసింది.

14 శాతం పెరిగిన స్పైస్‌జెట్ షేర్లు
వాణిజ్య సేవలకు బోయింగ్ 737 మాక్స్ విమానాలను వినియోగించుకునేందుకు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) అనుమతి ఇవ్వడం స్పైస్‌జెట్‌కు కలిసొచ్చింది. దీంతో గురువారం దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ షేరు విలువ 14 శాతం జంప్ చేసింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో స్పైస్‌జెట్ షేరు 11.70 శాతం పెరిగి రూ.74కు చేరింది. కాగా ఎఫ్‌ఎఎ నిర్ణయాన్ని అధ్యయనం చేస్తామని బుధవారం డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తెలిపింది. భారతదేశంలో మళ్లీ బోయిల్ 737 మాక్స్ విమానాలను అనుమతించే విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం తీసుకుంటామని పేర్కొంది.

Sensex falls 580 points to close at 43,600