Thursday, April 18, 2024

400 పాయింట్లకుపైగా ర్యాలీ చేసిన సెన్సెక్స్ !

- Advertisement -
- Advertisement -

 

Stock Market

ముంబై: గ్లోబల్ మార్కెట్లలో పెరుగుదల, తగ్గుతున్న కమోడిటీ ధరలను ట్రాక్ చేస్తూ, దేశీయ స్టాక్ మార్కెట్ నేడు వరుసగా మూడవ రోజు ర్యాలీని కొనసాగించింది. సెన్సెక్స్ 433 పాయింట్లు లేదా 0.82 శాతం పెరిగి 53,161.28 వద్ద ముగిసింది. కాగా  నిఫ్టీ-50   132.80 పాయింట్లు లేదా 0.85 శాతం జోడించి 16,320 మార్క్ పైన ముగిసింది. స్టాక్ మార్కెట్‌ ర్యాలీకి  దేశీయ అంశాల కంటే  ప్రపంచ కారకాలే ముఖ్యమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 78.34గా ఉంది. సెన్సెక్స్ లో ఎల్ఎన్ అండ్ టి, హెచ్ సిఎల్ టెక్నాలజీ,ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ రాణించగా, కొటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ప్రధానంగా ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ స్టాక్స్ రాణించాయి.

దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం భయం కారణంగా బ్లూమ్‌బెర్గ్ కమోడిటీ ఇండెక్స్ గత వారం 4.3 శాతం క్షీణించింది. లోహాలే కాదు, వ్యవసాయోత్పత్తుల ధరలు కూడా తగ్గాయి. జపాన్ యొక్క నిక్కీ 1.51% , ఆస్ట్రేలియా బెంచ్ మార్క్  2.03% పెరిగాయి. ఇతర ఆసియా మార్కెట్లలో కూడా మూడ్ ఉత్సాహభరితంగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News