Friday, March 29, 2024

పోయిందంతా వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Sensex

 సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు

రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్

న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత రెండో రోజు మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సోమ, మంగళవారాల్లో స్టాక్‌మార్కెట్ల ర్యాలీతో రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3.57 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 917 పాయింట్లు జంప్ చేయడంతో బడ్జె ట్ రోజు నష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. శనివారం బడ్జెట్ రోజు సెన్సెక్స్ 987 పాయింట్లు నష్టపోయిన విష యం తెలిసిందే. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 917 పా యింట్లు(2.30 శాతం) లాభపడి 40,789 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 40,818 పాయింట్ల గరిష్టానికి చేరింది. సోమవారం సెన్సెక్స్ 136 పాయిం ట్లు పెరిగింది. మార్కెట్‌లో రికవరీ కారణంగా బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ మూలధనం శనివారం రూ.3,57,044 కోట్లు పెరిగి రూ. 1,56,61,769 కోట్లకు చేరింది.

జనవరి నెలలో తయారీ రంగం ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్లకు వృద్ధి అంచనాలు పెరిగాయి. అంతర్జాతీయంగా సానుకూల అంశాలు ప్రభావం చూపాయి. కాగా బిఎస్‌ఇ సెన్సెక్స్ 30 కంపెనీల్లో టైటాన్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్ వంటి 28 స్టాక్స్ లాభపడ్డాయి. బిఎస్‌ఇలో 1,618 స్టాక్స్ లాభాల్లో, 885 స్టాక్స్ నష్టాల్లో ము గిశాయి. మిగతా 181 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ సూచీ 1.37 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ 1.29 శాతం జంప్ చేశాయి. సామ్కా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా మాట్లాడుతూ, బడ్జెట్ నిరాశపర్చడంతో శనివారం మార్కెట్లు భారీగా పతనమయ్యా యి.

అయితే దీర్ఘకాలం ఆర్థిక వృద్ధిలో బడ్జెట్ దోహదం చేస్తుందని గ్రహించిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు దూసుకెళ్లాయని అన్నారు. జనవరి వాహ న విక్రయాలు బాగుండడం, ప్రతికూల వార్తలేమీ లేకపోవడంతో దేశీయ మార్కెట్లు అకస్మాత్తుగా పుంజుకున్నాయని మెహతా తెలిపారు. అంతర్జాతీయంగా షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ఉండ డం, యూరప్ స్టాక్ ఎక్సేంజ్‌లో సానుకూలంగా ప్రారంభం కావడం కూడా దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌కు బలం చేకూర్చింది.

నష్టాలతో ప్రారంభమైంది కానీ..

ప్రారంభ మార్కెట్లో స్వల్ప క్షీణతతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. సెన్సెక్స్ 15.27 పాయింట్లు లేదా 0.04 శాతం తగ్గి 39,720.26 వద్ద మొదలు పెట్టింది. అదే సమయంలో నిఫ్టీ 8.85 పాయింట్లు లేదా 0.08 శాతం పడిపోయిన తరువాత 11,653 స్థాయిలలో ప్రారంభమైంది.

ప్రధాన స్టాక్‌లు

పెద్ద స్టాక్స్ విషయానికొస్తే టైటాన్, ఇన్‌ఫ్రాటెల్, ఐఒసి, బజాజ్ ఫిన్‌సర్వ్, బిపిసిఎల్, ఐటిసి, గెయిల్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. మరోవైపు జి లిమిటెడ్, బజాజ్ ఆటో, యస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

రంగాల వారీగా

రంగాల వారీగా సూచీలను పరిశీలిస్తే, అన్ని రంగాలు గ్రీన్ మార్క్‌లోనే ఉన్నాయి. వీటిలో ఐటి, పిఎస్‌యు బ్యాంక్, ఫార్మా, రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, మెటల్, మీడియా, ఆటో ఉన్నాయి. జనవరి నెలలో తయారీ రంగం ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్లకు వృద్ధి అంచనాలు పెరిగాయి.

తయారీ రంగం జోష్

దేశీయ తయారీ రంగం కార్యకలాపాలు జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. డిమాండ్ పరిస్థితుల్లో మెరుగుదల కారణంగా కొత్త వ్యాపార ఆర్డర్లు పెరగడంతో ఉత్పాదక, ఉద్యోగాల నియామకం పుంజుకుంటోందని సర్వే తెలిపింది. పిఎంఐ గత నెలలో 55.3 స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 2012 తర్వాత ఇది అత్యధికం. ఇది డిసెంబర్‌లో 52.7 గా ఉంది. కొత్త ఆర్డర్ల కారణంగా జనవరిలో ఉత్పత్తి పెరిగింది, ఉపాధి కూడా పెరిగింది. -ముడి చమురు ధర గణనీయంగా తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చాయి. గత కొన్ని రోజులలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 స్థాయి నుండి 50 డాలర్లకు పడిపోయింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల జనవరి 12 నుండి కనిపిస్తోంది. దీని ప్రభావం భారత స్టాక్‌మార్కెట్లో కూడా కనిపించింది.

అంతర్జాతీయంగా సానుకూలం

అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుదల, ఆసియా మార్కెట్లలో వృద్ధితో కూడిన ట్రేడింగ్ భారత మార్కెట్లో జోష్‌కు కారణయ్యాయని విశ్లేషకుల అభిప్రాయం. చైనా మార్కెట్ కూడా స్థిరత్వాన్ని చూస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్ కూడా సోమవారం లాభపడింది. జపాన్ సూచీ నిక్కీ మంగళవారం 0.1 శాతం లాభపడింది.

Sensex gains 917 points

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News