Saturday, April 20, 2024

హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు

- Advertisement -
- Advertisement -
Sensex
93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్ యునీలివర్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల లాభాలు మార్కెట్ పెరిగేందుకు దోహదం చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 93 పాయింట్లు పెరిగి 41,952 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 33 పాయింట్లు లాభపడి 12,362 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఓ దశలో 41,806 పాయింట్ల దిగువకు పడిపోయింది.

అయితే ఆఖరి గంటలో పుంజుకుని స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. 11 సెక్టార్లలో ఏడు రంగాలు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ మీడియా 2.1 శాతం లాభపడగా, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి, మెటల్, ఐటి, ఆటో సూచీలు 0.61.4 శాతం మధ్య పెరిగింది. నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ సూచీ 0.5 శాతంతో టాప్ లూజర్‌గా మిగిలింది. నిఫ్టీ 50లో వేదాంత టాప్ గెయినర్‌గా నిలిచింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఐటిసి, సిప్లా, జీ, నెస్లె ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు లాభపడ్డాయి. మరోవైపు యుపిఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి. మార్కెట్లో మొత్తంగా 1468 షేర్లు లాభపడగా, 1037 షేర్లు నష్టపోయాయి.

Sensex Gains 93 Points

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News