Thursday, April 25, 2024

మార్కెట్లకు జోష్

- Advertisement -
- Advertisement -

Stock-market

బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు
996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్‌లో ర్యాలీ కనిపించగా, ప్రపంచ మార్కెట్ల్ల సానుకూల సంకేతాలు వెరసి మార్కెట్లు దూసుకెళ్లాయి. షార్ట్ కవరింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్‌లో పొజిషన్ల రోలోవర్ వంటివి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉదయం నుంచి సూచీలు వెనక్కి చూసుకోకుండా పైపైకి ఎగసిపడుతూనే ఉన్నాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 995.92 పాయింట్లు లాభపడి 31,605 పాయింట్లకు చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ కూడా 286.95 పాయింట్లు పెరిగి 9,316.00 స్థాయిలో ముగిసింది. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ గ్రూప్ యాక్సిస్ బ్యాంక్‌లో రూ.7,600 కోట్లు పెట్టుబడి పెట్టనుందనే వార్తలతో ఈ బ్యాంక్ షేర్లు బాగా పెరిగాయి. బిఎస్‌ఇలో యాక్సిస్ బ్యాంక్ షేర్లు 14.15 శాతం జంప్ చేశాయి.

బ్యాంక్ నిఫ్టీ 7.28 శాతం పైకి

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ బ్యాంక్ అత్యధికంగా 7.28 శాతం పెరిగింది. ఆ తర్వాత నిఫ్టీ ఆటో 0.73 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.86 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.36 శాతం, ఐటి 2.78 శాతం, మెటల్ 2.56 శాతం, పిఎస్‌యు బ్యాంక్ 3.40 శాతం లాభంతో ముగిశాయి. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 7.46 శాతం పెరిగింది. రియాలిటీ ఇండెక్స్ కూడా 1.75 శాతం లాభంతో ముగిసింది. ఫార్మా, మీడియా సూచీలు మాత్రమే డౌన్ అయ్యాయి.

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఐదు పైసలు తగ్గి 75.71 వద్ద ముగిసింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య పెరిగిన ఉద్రిక్తత పరిస్థితులతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే అవకాశం, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోనున్నాయనే ఆశలతో రూపాయి బలపడింది. అయితే అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది.

ముఖ్యాంశాలు

 30 షేర్ల సెన్సెక్స్ 3.25 శాతం అంటే 996 పాయింట్లు లాభపడి 31,605 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 50-షేర్ల నిఫ్టీ 3.17 శాతం లాభం అంటే 286 పాయింట్లు పెరిగి 9,315 పాయింట్ల వద్ద స్థిరపడింది.  సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 24 షేర్లు లాభపడ్డాయి. బ్యాంకులు, ఐటి దిగ్గజాలు ఇన్ఫోసిస్, టిసిఎస్‌లు 4 శాతం వరకు పెరిగాయి.

టాప్ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్స్ అత్యధికంగా నష్టపోయింది. షేరు విలువ దాదాపు 1.85 శాతం డౌన్ అయింది. కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వార్షికంగా నికర లాభం 37.12 శాతం తగ్గింది. ఈ కారణంగా కంపెనీ స్టాక్ నష్టాలను చవిచూసింది.

 ఇండియా విక్స్ వరుసగా ఆరో సెషన్ పడిపోయింది. బుధవారం ఈ సూచీ 0.96 శాతం డౌన్ అయి 31.16 కు చేరింది.
బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.54 శాతం, 0.27 శాతం పెరిగాయి.
బిఎస్‌ఇ బ్యాంకెక్స్ 7.31 శాతంతో టాప్ సెక్టోరియల్ గెయినర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు గెయినర్లలో ముందు వరుసలో ఉన్నాయి.

 ఆ తర్వాత బిఎస్‌ఇ ఫైనాన్స్ ఇండెక్స్ 5.64 శాతం జంప్ చేసింది. యాక్సిస్ బ్యాంక్‌తో దోలత్ ఇన్వెస్ట్‌మెంట్స్ 13.7 శాతం పెరిగింది. బిఎస్‌ఇ హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రమే పతనమైంది. ఈ సూచీ 0.84 శాతం దిగువకు పడిపోయింది. బ్రోకరేజెస్ స్టాక్‌కు డౌన్‌గ్రేడ్ ఇవ్వడంతో టొరెంట్ ఫార్మా అత్యధికంగా 6.88 శాతం నష్టపోయింది.

భారతీయ షేర్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు 5.8 బిలియన్ డాలర్లు (రూ.43,852 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డిఐఐ)లు రూ.75,993 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Sensex gains 996 points Nifty tops 9300

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News