Home తాజా వార్తలు నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

Sensex jumped 748 points to close at 37,688

 

748 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: వరుసగా నాలుగు రోజులుగా నష్టాలను చవిచూసిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం మంచి లాభాలను చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కొనుగోళ్ల జోరుతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించింది. ఆర్‌బిఐ ద్రవ్య సమీక్ష విధాన సమావేశం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశం నిర్ణయాలు గురువారం ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందే మంగళవారం మార్కెట్లు మంచి ఉత్సాహంతో లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2.03 శాతం అంటే 768.31 పాయింట్లు పెరిగి 37,687 పాయింట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 211.25 పాయింట్ల లాభంతో 11102.85 వద్ద స్థిరపడింది.

అదే సమయంలో విదేశీ పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల సానుకూల పరిణామాల కారణంగా సెన్సెక్స్, -నిఫ్టీ ఊపందుకుంది. అంతకుముందు మార్కెట్ గత నాలుగు రోజులలో నష్టాలను నమోదు చేసింది. మరోవపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మూడు పైసలు కోల్పోయింది. పెద్ద స్టాక్స్ విషయానికొస్తే, రిలయన్స్, జీ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు బిపిసిఎల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, గెయిల్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా ఐటితో పాటు అన్ని రంగాలు లాభపడ్డాయి.

Sensex jumped 748 points to close at 37,688