Home తాజా వార్తలు రెండు రోజుల నష్టాలకు బ్రేక్

రెండు రోజుల నష్టాలకు బ్రేక్

Sensex jumps 358 pts on positive global cues

 

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌పడింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో లాభాలు మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు పెరిగి 52,300 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 102 పాయింట్లు పెరిగి 15,737 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఆటో సెక్టార్ మినహా మిగతా 11 రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మీడియా సూచీ 4 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్, రియాల్టీ సూచీలు కూడా 1 నుంచి 3 శాతం పెరిగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లు 2 శాతం మేరకు లాభపడ్డాయి. ఇక బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, యుపిఎల్, అదానీ పోర్ట్, శ్రీ సిమెంట్స్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హెచ్‌సిఎల్ టెక్‌లు నష్టపోయాయి. బిఎస్‌ఇలో 2,456 షేర్లు లాభపడగా, మిగతా 727 షేర్లు నష్టాలను చవిచూశాయి.

Sensex jumps 358 pts on positive global cues