Home తాజా వార్తలు లాభాల జోరు..

లాభాల జోరు..

Sensex

 

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. సూచీలు మూడు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండడం, ఫెడరల్ రిజర్వు చైర్మన్ ఆర్థిక వ్యవస్థ సానుకూలత వ్యక్తం చేయడంతో ప్రపంచ దేశాల మార్కెట్లు ఉత్సహంగా కనిపించాయి. దేశీయంగా సెన్సెక్స్ ఓ దశలో 456 పాయింట్లు పెరిగింది. కానీ తర్వాత కొంతమేరకు తగ్గింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 41,565 పాయింట్ల వద్ద స్థిరపడింది.

మరోవైపు నిఫ్టీ 12,200 పాయింట్లు మార్క్‌ను చేరుకుంది. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 12,201 పాయింట్ల వద్ద ముగిసింది. హిందుస్తాన్ యునిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లు లాభాలతో దూసుకెళ్లడంతో మార్కెట్లు పైపైకి ఎగబాకాయి. రంగాల వారీగా చూస్తే బిఎస్‌ఇ ఎనర్జీ, ఐటి, బ్యాంకెక్స్ సూచీలు 0.7-0.8 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు బిఎస్‌ఇ పవర్ ఇండెక్స్ 1 శాతం నష్టంతో టాప్ లూజర్‌గా మిగిలింది.

Sensex Jumps Over 350 points