Home తాజా వార్తలు ‘బేర్’మన్న మార్కెట్లు

‘బేర్’మన్న మార్కెట్లు

Sensex loses 1145 points to fall under 50,000 mark

 

1,145 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
50 వేల పాయింట్ల దిగువకు సూచీ
14,700 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబై : బడ్జెట్ తర్వాత నుంచి ఉత్సాహంగా కనిపించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇప్పుడు నష్టాల బాటపట్టాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు విధించడం, మరోవైపు లాభాల స్వీకరణ కారణంగా ఐదో సెషన్‌లోనూ సూచీలు నష్టపోయాయి. అయితే ఈసారి భారీగా మార్కెట్లు పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్‌స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను డీలాపడేలా చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ భారీగా 306.05 పాయింట్లు (-2.04%) నష్టపోయి 14675.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ -306.05 పాయింట్లు (-2.04%) కోల్పోయి 14675.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెప్టెంబర్‌లో భారీ స్థాయి నుంచి కోవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టాయి.

కానీ మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరగడంలో కొత్తగా ఆంక్షలు విధించగా, సెకండ్ వేవ్ భయాందోళనలు మొదలయ్యాయి. సెన్సెక్స్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయింది. రిలయన్స్‌ఫ్యూచర్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ 3 శాతం పడిపోయి రూ.2,022కు చేరింది. రిలయన్స్‌హెవీ వెయిట్ స్టాక్ కావడంతో మార్కెట్‌పై భారీ ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల మేర దిగువ చేరింది. అయితే నిఫ్టీలో ఐషర్ మోటార్స్ 5 శాతం పడిపోయి రూ.2,453కు చేరింది. ప్రధానంగా మహీంద్రా అండ్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ లైఫ్, టిసిఎస్, లారెన్ అండ్ టుబ్రో, మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా మోటార్స్ వంటి షేర్లు 3 నుంచి 5 శాతం మేరకు పడిపోయాయి. మరోవైపు మెటల్ షేర్లు మంచి పనితీరును చూపాయి.

సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం షేర్లు అత్యధికంగా 4.-4% క్షీణించాయి. ఇవే కాకుండా ఇండస్‌ఇండ్ బ్యాంక్, టిసిఎస్, ఎస్‌బిఐ షేర్లు కూడా 3-.3% నష్టపోయాయి. మరోవైపు ఒఎన్‌జిసి, కోటక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు స్వల్ప లాభంతో ముగిశాయి. ఎక్స్ఛేంజ్‌లో 3,179 షేర్లు ట్రేడవ్వగా, 1,039 షేర్లు లాభపడి, 1,984 షేర్లు నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ మాట్లాడుతూ, చాలా ఆసియా మార్కెట్లు పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం, ఇతర అంశాలు ఉన్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధర ఆర్థిక వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోందని అన్నారు. 2021 జనవరి నుండి మార్కెట్ క్రమంగా పెరుగుతూ వచ్చిందని, ఇప్పుడు ఈ క్షీణతను లాభాల స్వీకరణగా భావించవచ్చని అన్నారు.

రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.14 లక్షల కోట్లు తగ్గి రూ.199.88 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది శుక్రవారం రూ .203.98 లక్షల కోట్లుగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నందున మార్కెట్ సెంటిమెంట్ క్షీణించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ప్రపంచ మార్కెట్లో బాండ్ల దిగుబడి, ద్రవ్యోల్బణం పెరగడం ఈ పతనానికి తోడ్పడింది. పెట్టుబడిదారులు క్షీణత మధ్య కొనుగోలు చేయాలని సూచించారు.

ఐటి, ఆటో స్టాక్స్‌లో అమ్మకాలు
ఐటి, బ్యాంకింగ్, ఆటో సెక్టార్ స్టాక్‌లను ఇన్వెస్టర్లు భారీగా అమ్మారు. ఫలితంగా ఐటి ఇండెక్స్ 736 పాయింట్లు లేదా 2.89% తగ్గి 24,766.45 వద్దకు చేరింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా 306 పాయింట్లు తగ్గి 14,675.70 వద్ద ముగిసింది. 5 సెషన్ల పతనంలో నిఫ్టీ ఆల్‌టైమ్ హై నుండి 5 శాతానికి దిగివచ్చింది. మరోవైపు మెటల్ స్టాక్స్‌లో కొనుగోలు చేయడం వల్ల ఇండెక్స్ 57 పాయింట్లు పెరిగి 3,609.10 వద్ద స్థిరపడింది. హిందూస్తాన్ కాపర్ షేర్లు 14 శాతం అత్యధికంగా ముగిశాయి.

భారీ విదేశీ పెట్టుబడులు కొనసాగాయి
ఆర్థిక సంస్కరణలు, బడ్జెట్ ఆధారిత సెంటిమెంట్ కారణంగా పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎన్‌ఎస్‌ఇ తాత్కాలిక గణాంకాల ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) రూ.118.75 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐ) రూ.1,174.98 కోట్ల షేర్లను అమ్మారు. డిపాజిటరీ డేటా ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) ఫిబ్రవరి 1-1 9 మధ్య రూ .24,965 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈక్విటీ మార్కెట్లో రూ.24,204 కోట్లు, డెబిట్ మార్కెట్లో రూ .761 కోట్లు పెట్టుబడి పెట్టారు.

పతనానికి కారణాలు
మహారాష్ట్ర, కేరళతో సహా దేశంలోని 16 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. భారీ పతనంతో యూరప్ స్టాక్‌మార్కెట్లు మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. వీటిలో బ్రిటన్ ఎఫ్‌టిఎస్‌ఇ సూచీ, ఫ్రాన్స్ కాస్ ఉన్నాయి. సూచీ 1-1 శాతం కంటే తక్కువగా ఉంది. దేశీయ మార్కెట్ షేర్లు బాగా పడిపోయాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, ఎస్‌బిఐ వంటి పెద్ద స్టాక్‌లు ఉన్నాయి.

Sensex loses 1145 points to fall under 50,000 mark