Home తాజా వార్తలు రెండో రోజూ నష్టాలు

రెండో రోజూ నష్టాలు

Sensex lost 194.17 points to close at 37,934.73

 

సెన్సెక్స్ 38,000 దిగువకు సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. దీంతో వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ప్రారంభం లాభాలతో కనిపించినా ఆ వెంటనే సూచీలు నష్టంలోకి వెళ్లాయి. కరోనా కేసులు పెరుగుతుండడం, యుఎస్-చైనాలో మధ్య ఉద్రిక్త పరిస్థితులు, లాభాల రికవరీ, బ్యాంక్ షేర్ల బలహీనమైన పనితీరు కారణంగా మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికిస సెన్సెక్స్ 194.17 పాయింట్లు కోల్పోయి 37,934.73 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 62.35 పాయింట్ల నష్టంతో 11,131.80 స్థాయిలో స్థిరపడింది. బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ 3.59 శాతం పడిపోయింది.

నిఫ్టీలో ఐసిఐసిఐ బ్యాంక్ 6.05 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.81 శాతం, పిఎన్‌బి 3.73 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 3.50 శాతం నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ 146 పాయింట్ల లాభంతో 38,275 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ లాభం ఎంతసేపూ ఉండలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ కొత్త శిఖరాన్ని చూస్తోంది. ఇంట్రాడేలో దీని ధర రూ.2,200 కు చేరుకుంది. తరువాత ఇది రూ.2,155 వద్ద ముగిసింది. గత 7 రోజులుగా ఇది 19 శాతం పెరిగింది. నిఫ్టీ టాప్ గెయినర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.93 శాతం, టిసిఎస్ 1.88 శాతం, ఏసియన్ పెయింట్స్ 1.57 శాతం, ఇన్ఫోసిస్ 1.07 శాతం, ఎల్ అండ్ టి 1.01 శాతం పైన ట్రేడయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, అదాని పోర్టు షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

Sensex lost 194.17 points to close at 37,934.73