Home తాజా వార్తలు భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

Sensex

 

ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి.  సెన్సెక్స్ 2,627 పాయింట్లు నష్టపోయి27,347 పాయింట్లు వద్ద కొనసాగుతోంది. నిప్టీ 768 పాయింట్ల నష్టంతో 7,976 పాయింట్లు వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా దేశంలోని 7 రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొడంతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.  దేశంలో కరోనా వైరస్ రెండోదశకు చేరవడంతో ఆదివారం ఒక్క రోజే ముగ్గురు మృతిచెందారు. ఇక దేశంలో కొవిడ్ -19 సమస్య తీవ్రమవుతుందనే సంకేతాల తలెత్తడంతో ఎప్పుడు బయటపడుతామో తెలియని పరిస్థితి నెలకొనడంతో మదుపరులు అమ్మాకాలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. జపాన్ మార్కెట్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభం కావడంతో ఆ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది.

Sensex lost 2,627 points to 9,756 today