Home తాజా వార్తలు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Sensex opened over 877 points higher

 

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 877 పాయింట్లు లాభపడి 33,301 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో 9,827 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. డాలరుతో పోలిస్టే రూపాయి మారకం విలువ రూ.75.30గా ఉంది. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను మన మార్కెట్‌ అందిపుచ్చుకుంది. కరోనా కట్టడికి విధించి లాక్‌డౌన్‌ను కేంద్రం విడతల వారీగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది.

Sensex opens over 877 points higher