Friday, April 26, 2024

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూసినప్పటికీ, ఆఖరికి స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి 60,967 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 10.5 పాయింట్లు పెరిగి 18,125 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్ లాభపడగా, మరోవైపు ఆటో, రియాల్టీ స్టాక్స్ నష్టాలను చవిచూశా యి. రంగాల వారీగా చూస్తే బ్యాంక్ మినహా మిగతా సూచీలు ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఐటి, రియాల్టీ వంటి సూచీలు 2 శాతం వరకు డౌన్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్‌టైమ్ హై 41,830 పాయింట్లకు చేరుకోగా, ఆఖరికి 2.2% లాభంతో 41,192 పాయింట్ల వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1% చొప్పున పతనమయ్యా యి. ఇండియా విక్స్ 1.4 శాతం పెరిగి 17.16కి చేరింది. ఈక్విటీ99 కొఫౌండర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, తీవ్ర ఒడిదుడుకులను చూసిన తర్వాత నిఫ్టీ 18000 పాయింట్ల పైన ముగిసిందని, ప్రైవేటు బ్యాంకుల నుంచి మద్దతు ఉండడంతో బ్యాంకింగ్ ఇండెక్స్ మాత్రమే లాభాలను చూశాయని అన్నారు. మిడ్‌క్యాప్ సూచీ 529 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 868 పాయింట్లు జంప్ చేసింది. నిఫ్టీ 50లో ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి పెరిగాయి. బిపిసిఎల్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్లుగా మిగిలాయి.

Sensex rises 145 points after 4 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News