Home తాజా వార్తలు వారాంతంలో మార్కెట్లు హ్యాపీ

వారాంతంలో మార్కెట్లు హ్యాపీ

Sensex

 

ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్247 పాయింట్లు వృద్ధి

ముంబయి: తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చివరికి లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతా లతో పాటుగా అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. అమ్మకాల ఒత్తిడితో ఆరంభంలో కాస్త హెచ్చతగ్గులకు ఐటి, లోహ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు నిలదొక్కుకునన్నాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 11,300 పాయింట్ల ఎగువన ముగిసింది.సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో ఉత్సాహంగా మొదలైనాయి.

ఆరంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఒక్కసారిగా నేల చూపులు చూడడం ప్రారంభించింది. ఒక దశలో ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా కొనసాగింది. అయితే మధ్యాహ్నం తర్వాత లోహ, ఐటి రంగాల షేర్లలో కొనుగోళ్లతో తిరిగి పుంజుకుంది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి 38,127పాయింట్ల వద్ద స్థిరడింది. నిఫ్టీ సైతం 70 పాయింట్లు పుంజుకొని 11, 305 పాయింట్ల వద్ద ముగిసింది.మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 71.03గా కొనసాగుతోంది.

రాణించిన ఇన్ఫీ, సిప్లా
త్రైమాసిక ఫలితాల అంచనాలతో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు రాణించాయి. ఈ రోజు ట్రేడింగ్‌లో ఆ కంపెనీ షేరు 4 శాతానికి పైగా లాభపడింది. అటు సిప్ల్లా, వేదాంత లిమిటెడ్, టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ షేర్లు రాణించగా, ఐఒసి, యస్ బ్యాంక్, గెయిల్, మహింద్రా అండ్ మహింద్రా, రిలయన్స్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టపోయాయి.

Sensex rises 247 points on positive global cues