Home తాజా వార్తలు 60,000 మార్క్ దిగువకు సెన్సెక్స్

60,000 మార్క్ దిగువకు సెన్సెక్స్

Sensex sinks 634 points to end below 60k

 

వరుసగా మూడో రోజు పతనం

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను చవిచూశాయి. గురువారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ కీలక 60,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు పెంచడం, అమెరికా బాండ్ ఈల్డ్ పెరుగుదల, చమురు ధరలు పైపైకి చేరడం, ద్రవ్యోల్బణం ఆందోళనలు వెరసి మార్కెట్లు కుప్పకూలాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 634 పాయింట్లు కోల్పోయి 59,465 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 1,844 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 17,757 పాయింట్లకు చేరుకుంది.

ఈ రెండు సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. సూచీలు కీలక సపోర్ట్ లెవెల్‌కు చేరడంతో ఇక్కడి నుంచి మార్కెట్లు రికవరీ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సిలు నష్టపోయాయి. ఇక పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, జెఎస్‌డబ్లు స్టీల్, గ్రాసిమ్, ఏసియన్ పెయింట్స్ నష్టాలను చవిచూశాయి. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.14 శాతం, 0.06 శాతం చొప్పున క్షీణించాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ పెరగ్గా, మరోవైపు ఫార్మా అత్యధికంగా 1.7 శాతం పడిపోయింది.

Sensex sinks 634 points to end below 60k