Home తాజా వార్తలు నష్టాల్లోనే మార్కెట్లు

నష్టాల్లోనే మార్కెట్లు

Sensex slips 336 points to settle below 60,923

 

336 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను చవిచూశాయి. గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ వల్ల హెవీవెయిట్ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టిసిఎస్‌లో అమ్మకాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు కుదేలయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336 పాయింట్లు కోల్పోయి 60,923 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 18,178 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ స్టాక్స్‌లో ఏసియన్ పెయింట్స్ భారీగా 5 శాతం నష్టపోయింది. ఆ తర్వాత రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టిసిఎస్, డా.రెడ్డీస్ ల్యాబ్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి వంటి స్టాక్స్ నష్టపోయాయి. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ, హై వాల్యుయేషన్, వస్తువుల ద్రవ్యోల్బణం పెరగడంతో కంపెనీల మార్జిన్లను ప్రభావితం చేస్తున్నాయని, వీటి వల్ల దేశీయ మార్కెట్లపై ప్రతికూలత కనిపిస్తోందని అన్నారు.

Sensex slips 336 points to settle below 60,923