Friday, April 19, 2024

రెండో రోజూ లాభాలు

- Advertisement -
- Advertisement -
Sensex Surges 1223 Points
1,223 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,223 పాయింట్లు (2.29 శాతం) పెరిగి 54,647 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 332 పాయింట్లు లాభపడి 16,345 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు మంచి లాభాలను చూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2.16 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచీ 2.38 శాతం లాభపడింది. అంతర్జాతీయ విమానాలపై కరోనా మహమ్మారి ఆంక్షలను కేంద్రం ఎత్తివేయడంతో ఏవియేషన్ స్టాక్స్ కూడా పెరిగాయి. 15 సెక్టార్లకు గాను 14 రంగాలు గ్రీన్‌లో కనిపించాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఆటో ఇండెక్స్ అద్భుతంగా రాణించాయి. ప్రధానంగా ఏసియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ బ్యాంక్, ఎం అండ్ ఎం భారీగా పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News