Home తాజా వార్తలు కొనసాగుతున్న నష్టాలు

కొనసాగుతున్న నష్టాలు

Sensex tanks 276 points

 

72 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై : వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టపోయాయి. కీలక ఆర్థిక గణాంకాలు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండడం కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు కోల్పోయి 54,088 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 16,0167 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 16,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. కానీ ఆఖరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఎన్‌టిపిసి, లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ 2 శాతం మేరకు పతనమయ్యాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ, ఇన్ఫోసిస్, ఐటిసి కూడా నష్టపోయాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ 2 శాతం పెరగ్గా, ఇండస్‌ ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ బ్యాంక్ లాభపడ్డాయి.

Sensex tanks 276 points