Home Default ఈశాన్యాన ప్రత్యేక ప్రకంపనలు!

ఈశాన్యాన ప్రత్యేక ప్రకంపనలు!

Gorkhaland-Protes

గౌహతి: ఒకవేళ గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్టం ఏర్పడితే ఈశాన్య ప్రాంతంలో మరిన్ని ‘ప్రత్యేక’ ఉద్యమాలు ఊ పందుకుంటాయి. గూర్ఖాలాండ్ ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యే క రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తోన్న కనీసం మరో ఎని మిది ఉద్యమాలు ఉధృత మయ్యే అవకాశాలు కన్పిస్తు న్నాయి. ఈశాన్యంలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలున్నాయి. మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌లు అసోం నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించాయి. ఎనిమిది ఉద్యమాల్లో ముఖ్యమైనది బోడోలాండ్ ఉద్యమం. బోడోలాండ్‌లో పశ్చిమ, ఉత్తరమధ్య అసోం ప్రాంతాలు కలిసి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో గిరిజన జాతి, బోడో ల ప్రాబల్యం అధికం. అసోంలో కార్బి ఆంగ్‌లాంగ్ కో సం కార్బి గిరిజన తెగ, దిమారాజి కోసం దిమాసా గిరి జన జాతి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నా యి. మధ్య అసోంలోని మూడు జిల్లాల్లో ఈ రెండు గిరి జన తెగలు ఎక్కువగా నివసిస్తున్నాయి. మరోవైపు కామా టపూర్ రాష్ట్రం కోసం కోచ్-రాజ్‌బోంగ్షి కమ్యూనిటీ కూ డా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తోంది. ప్రతి పాది త కామాటపూర్ రాష్ట్ర మ్యాపులో గూర్ఖాలాండ్, బోడో లాండ్ డిమాండ్ చేస్తున్న ప్రాంతాలు అధికంగా ఉండ టం గమనార్హం. ‘దేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు భాష ప్రా తిపదికయితే, విలక్షణమైన భాషను మాట్లాడే బోడోలు ప్రత్యేక రాష్ట్రానికి అర్హులు. 1967 నుండి పోరాటం చేస్తు న్నాం. ప్రత్యేక రాష్ట్రానికి మా డిమాండ్‌ను కాదనడానికి కారణం లేదు’ అని అఖిల భారత బోడో విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రమోద్ బోరో హిందూస్తాన్ టైమ్స్ వార్తా పత్రికకు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, అసోంలో 20 లక్షల మంది బోడోలున్నారు. అంటే, మొత్తం 31.2 మిలియన్ల రాష్ట్ర జనాభాలో 5.5 ‘ప్రత్యేక రాష్ట్రం విషయంలో మాకు ఎవరూ సరిలేరు. ఈనాటి అసోం, పశ్చిమబెంగాల్‌లోని అనేక ప్రాంతాలపై కోచ్-రాజ్‌బోంగ్షీల పాలనకు చారి్ర తక ఆధారాలున్నాయి’ అని అసోం కోచ్ రాజ్‌బోంగ్షి విద్యార్థుల సంఘం (ఎకెఆర్‌ఎస్‌యు) అధ్యక్షుడు ప్రదీప్ రాయ్ వెల్లడించారు. కాగా, కామాటపూర్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఎకెఆర్‌ఎస్‌యు అసోంలో అనేక సందర్భాల్లో ఆందోళనా కార్యక్రమాలను చేపట్టి, దుకా ణాలు, పాఠశాలల మూసివేతలకు ఉపక్రమించి ంది. అసోం, పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా దాదాపు 14 మి లియన్ల మంది కోచ్-రాజ్‌బోంగ్షీలు ఉన్నారు. కార్బిఆం గ్‌లాంగ్, దిమారాజి ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు కొంత కాలం పాటు వాయిదా పడుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో నాగాలాండ్ నుండి తూర్పు నాగాలాండ్‌ను, మణిపూర్ నుండి కుకిలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పా టు చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అ యితే మణిపూర్‌లోని కుకి-జోమి గిరిజన తెగను బుజ్జ గించే దిశగా గతేడాది ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కుకిలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ప్రస్తుతా నికి చల్లారిపోయిందనే చెప్పాలి. మరోవైపు మేఘాల యలోని గారోలాండ్ ఉద్యమం చుట్టపుచూపులా అప్పుడ ప్పుడు తెరపైకి వచ్చి మళ్లీ కనుమరుగవుతోంది.
గారోల గుర్తింపుకే ప్రత్యేక ఉద్యమం
గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పడితే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గారో హిల్స్ రాష్ట్ర ఉద్యమ కమిటీ (జిహెచ్ ఎస్‌ఎంసి) చెబుతోంది. మేఘాలయలోని ఐదు జిల్లాలు, మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 24 ప్రతిపాదిత గారోలాం డ్ పరిధిలోకి వస్తాయి. ‘తరచూ హక్కులకు దూరమ వుతున్న గారోల గుర్తింపును కాపాడటానికే ఈ ఉద్య మం’ అని జిహెచ్‌ఎస్‌ఎంసి నేత అగస్తీన్ మారక్ కొద్దికా లం కిందట చెప్పారు. మరోవైపు గూర్ఖాలాండ్ ఉద్యమం త్రిపురలోని త్విప్రాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్. గతే డాది ఆగస్టులో చేపట్టిన త్విప్రా లాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్య మం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.