Tuesday, January 31, 2023

భారీ వినోదంతో ముంచెత్తనున్న సీక్వెళ్లు

- Advertisement -

Sequelహాలీవుడ్ ట్రెండ్ అయిన సీక్వెళ్లు ఇప్పుడు ఇండి యన్ సినిమాల్లోనూ పెరుగుతున్నా యి. తెలుగు, తమిళ్, హిందీ భాష ల్లో భారీ అంచనాల మధ్య రూపొందిన పలు చిత్రాలకు ఈ ఏడాది సీక్వెళ్లు రానున్నాయి. ముఖ్యంగా తెలుగులో బాహుబలి-2, రాజుగారి గది-2 చిత్రాలు ఇప్పటికే ఆసక్తిరేపుతు న్నాయి. ప్రభాస్ కథానాయకునిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ఎంతటి సంచలన విజ యం సాధించిందో తెలిసిందే. దానికి కొనసా గింపుగా తెరకెక్కుతున్న బాహుబలి-2… ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవు తోంది. ఈ చిత్రం కూడా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది’ చిత్రం ఓ పెద్ద చిత్రం స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో దానికి సీక్వెల్ తీస్తే బావుంటుందని భావించి రాజుగారి గది-2కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో నాగార్జునలాంటి పెద్ద స్టార్ నటిస్తుండడంతో ఈ సిని మాకు మరింత హైప్ వచ్చింది. వరుస విజయాలతో ఉన్న నాగార్జునకు ఈ సీక్వెల్ కథ ఎంతగానో నచ్చి ఈ చిత్రం చేసేందుకు అంగీకరించాడు. నాగార్జున వంటి పెద్ద స్టార్ నటిస్తుండడంతో సినిమాకు ఓంకార్ ఛాలెంజింగ్‌గా చేస్తున్నాడట. ఇక తెలుగు ప్రేక్షకులతో విడదీయలేని అనుబంధం పెంచుకుంటున్న తమిళ సినీ రంగం నుంచి కూడా సీక్వెళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య కథానాయకుడిగా కోలీవుడ్ లో రూపొందిన సింగం సిరీస్ రెండు చిత్రాలు అక్కడే కాదు టాలీవుడ్‌లో కూడా ఘన విజ యం సాధించాయి. సూర్య ‘సింగం-3’ ఈనెల 26న విడుద లకానుంది. రజనీకాంత్ కథానా యకుడిగా శంకర్ దర్శకత్వం లో వచ్చిన రోబో చిత్రం ప్రేక్షకులను అమితంగా అలరించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సీక్వె ల్ తెరకెక్కుతోంది. ఈ భారీ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుం ది. వీటితో పాటు కమల్‌హాసన్ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన విశ్వరూపం-2 విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. గత ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆశించారు. అయితే ఈ ఏడాది దీనికి విడుదల పరంగా మోక్షం కలుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం కమల్ చేస్తున్న శభాష్ నాయుడు చిత్రం విడుదల తర్వాతే విశ్వరూపం-2 విడుదల కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధనుష్ నటించిన విఐపి చిత్రం అటు తమిళ్‌లో ఇటు తెలుగులో యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా విఐపి-2 రాబోతోంది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles