Friday, April 19, 2024

వాంగ్ సంచలనం

- Advertisement -
- Advertisement -

Australian Open

 

మెల్‌బోర్న్: సాఫీగా సాగిపోతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుక్రవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్న సెరెనా విలియమ్స్ (అమెరికా), నవోమి ఒసాకా (జపాన్)లు మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. 8వ సీడ్ సెరెనాపై చైనాకు చెందిన 27వ సీడ్ జియాన్ వాంగ్ సంచలన విజయం సాధించింది. మరోవైపు మూడో సీడ్ ఒసాకాను అమెరికా టినేజర్ కొకొ గాఫ్ ఇంటిదారి పట్టించింది. కాగా, టాప్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), 22వ సీడ్ మారియా సక్కారి (గ్రీక్) మూడో రౌండ్‌లో విజయం సాధించారు. అయితే పదో సీడ్ మాడిసన్ కీస్, కరోలిన్ వోజ్నియా తదితరులు ఓటమి పాలయ్యారు.

ఇక, శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో చైనా స్టార్ వాంగ్ హోరాహోరీ పోరులో అమెరికా దిగ్గజం సెరెనాపై సంచలన విజయం సాధించింది. మూడు సెట్ల సమరంలో వాంగ్ 64, 67, 75తో సెరెనాను మట్టి కరిపించింది. ఇక, మరో పోటీలో అమెరికా సంచలనం గాఫ్ అగ్రశ్రేణి క్రీడాకారిణి ఒసాకాను కంగుతినిపించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన గాఫ్ 63, 64తో ఒసాకాను ఓడించింది. ఇక, బార్టీ, క్విటోవాలు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అతి కష్టం మీద గట్టెక్కాడు. ప్రస్తుత ఛాంపియన్ జకోవిచ్ (సెర్బియా), 12వ సీడ్ ఫాబియో ఫొగ్నిని (ఇటలీ) తదితరులు మూడో రౌండ్‌లో విజయం సాధించారు.

Serena and Osaka lose at Australian Open
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News