Friday, March 29, 2024

సెమీస్‌లో సెరెనా

- Advertisement -
- Advertisement -

Serena

 

అక్లాండ్: అమెరికా వెటరన్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రతిష్టాత్మకమైన అక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 64, 63తో జర్మనీ క్రీడాకారిణి లౌరా సిగ్మండ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే సెరెనా చెలరేగి ఆడింది. తన మార్క్ షాట్లతో అలరించిన సెరెనా వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో పోటీలో ఐదో సీడ్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) విజయం జయభేరి మోగించింది. నాలుగో సీడ్ జులియా జార్జెస్ (జర్మనీ)తో జరిగిన పోరులో వోజ్నియాకి అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన 61, 64తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభ సెట్‌లో వోజ్నియాకికి ఎదురే లేకుండా పోయింది. చూడచక్కని షాట్లతో చెలరేగిన మాజీ నంబర్‌వన్ సునాయాసంగా సెట్‌ను సొంతం చేసుకుంది.

రెండో సెట్‌లో మాత్రం వోజ్నోయాకికి కాస్త పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన డెన్మార్క్ స్టార్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. మరోవైపు మూడో సీడ్ అమండా అనిసిమోవా (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్లో జయభేరి మోగించింది. కెనడా క్రీడాకారిణి బౌచర్డ్‌తో జరిగిన పోరులో అనిసిమోవా 62, 36, 64తో విజయం సాధించింది. తొలి సెట్‌లో అమండా దూకుడును ప్రదర్శించింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిపై ఎదురు దాడికి దిగింది. అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది.

కానీ, రెండో సెట్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి బౌచర్డ్ ఆధిపత్యం చెలాయించింది. దూకుడగా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన అమండా సెమీస్ బెర్త్‌ను సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి జెసికా జయకేతనం ఎగుర వేసింది. ఫ్రాన్స్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో జెసికాకు సెమీస్ బెర్త్ ఖాయమైంది.

Serena at Auckland Open Tennis Tournament semis
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News