Friday, April 26, 2024

క్వార్టర్స్‌లో సెరెనా, వోజ్నియాకి

- Advertisement -
- Advertisement -

Serena

అక్లాండ్: అక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు నాలుగో సీడ్ జులియా జార్జెస్ (జర్మనీ), ఐదో సీడ్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్) కూడా ముందంజ వేశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో సెరెనా చెమటోడ్చి విజయం సాధించింది. అమెరికాకే చెందిన క్రిస్టియానాతో జరిగిన పోరులో సెరెనా 36, 62, 63తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో సెరెనాకు షాక్ తగిలింది. క్రిస్టియానా అద్భుత ఆటతో సెరెనాను కంగుతినిపించింది. అయితే ఈ ఆనందం క్రిస్టియానాకు ఎంతో సేపు నిలువలేదు. తర్వాత జరిగిన రెండు సెట్లలో సెరెనా ఆధిపత్యం చెలాయించింది.

ప్రత్యర్థిని హడలెత్తిస్తూ వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరో పోటీలో వోజ్నియాకి విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి లౌరా డేవిస్‌తో జరిగిన రెండో రౌండ్‌లో వోజ్నియాకి 61, 46, 64తో విజయాన్ని అందుకుంది. తొలి సెట్‌లో వోజ్నియాకి దూకుడును కనబరిచింది. తన మార్క్ షాట్లతో అలరించిన వోజ్నియాకి సునాయాసంగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ, రెండో సెట్‌లో వోజ్నియాకికి షాక్ తగిలింది.

ఈసారి డేవిస్ ఆధిపత్యం చెలాయించింది. అద్భుత షాట్లతో అలరించిన డేవిస్ సెట్‌ను దక్కించుకుంది. ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. అయితే ఈసారి చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన వోజ్నియాకి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు నాలుగో సీడ్ జులియా 64, 63తో జిల్ టిచ్‌మాన్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన జులియా వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది.

Serena battles into Auckland quarterfinals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News