Wednesday, May 29, 2024

ఫైనల్లో సెరెనా

- Advertisement -
- Advertisement -

Serena

అక్లాండ్ : ఎటిపి అక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ఫైనల్‌కు చేరుకుంది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సెరెనా శనివారం జరిగిన సెమీఫైనల్లో అలవోక విజయాన్ని అందుకుని టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఏక పక్షంగా సాగిన సెమీస్ పోరులో తన దేశానికి చెందిన మూడో సీడ్ అమండా అనిసిమోవాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సెరెనా 61, 61తో విజయం అందుకుంది. సెరెనా ధాటికి అమండా కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. ప్రారంభం నుంచే సెరెనా తన మార్క్ షాట్లతో చెలరేగి పోయింది.

అసాధారణ ఆటతో అలరించిన సెరెనా అలవోకగా రెండు సెట్లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఇక, మరో సెమీస్‌లో డెన్మార్క్ స్టార్, ఐదో సీడ్ కరోలిన్ వోజ్నియాకికి చుక్కెదురైంది. అమెరికా క్రీడాకారిణి జెసికాతో జరిగిన పోరులో వోజ్నియాకి ఓటమి చవిచూసింది. అద్భుత ఆటను కనబరిచిన జెసికా 36, 64, 60తో వోజ్నియాకిని చిత్తు చేసింది. తొలి సెట్‌లో గెలిచి జోరుమీద కనిపించిన వోజ్నియాకి ఆ తర్వాత పట్టును కోల్పోయింది. వరుసగా రెండు సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Serena races into Auckland final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News