Friday, April 19, 2024

సెరెనా, థిమ్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

సెరెనా, థిమ్ శుభారంభం
క్విటోవా, స్విటోలినా ముందుకు, రెండో రౌండ్‌లో జ్వరేవ్, ఫ్రెంచ్ ఓపెన్

Serena Reaches 2nd round in French Open 2020

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డొమినిక్ థిమ్(ఆస్ట్రియా), అలెగ్జాండెర్ జ్వరేవ్ (జర్మనీ) శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ విబాగంలో మూడో సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్) కూడా ముందంజ వేసింది. ఇతర పోటీల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్), మార్టినెజ్ (స్పెయిన్) తదితరులు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. కాగా, మాజీ నంబర్‌వన్ ఆండ్రీ ముర్రే (బ్రిటన్) ఇంటిదారి పట్టాడు. కిందటిసారి రన్నరప్, మూడో సీడ్ డొమినిక్ థిమ్ తొలి రౌండ్‌లో అలవోక విజయం సాధించాడు. క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్‌తో జరిగిన మ్యాచ్‌లో థిమ్ 64, 63, 63తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన థిమ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మరో పోటీలో 16వ సీడ్ వావ్రింకా 61, 63, 62తో ముర్రేను ఓడించాడు. ఇక ఆరో సీడ్ జ్వరేవ్ 75, 62, 64తో డెన్నిస్ నొవాక్ (ఆస్ట్రియా)ను చిత్తు చేశాడు.
సెరెనా జోరు
మరోవైపు మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ జయకేతనం ఎగుర వేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో సెరెనా 76, 60తో అమెరికాకే చెందిన క్రిస్టి ఆన్‌ను చిత్తు చేసింది. తొలి సెట్‌లో సెరెనాకు గట్టి పోటీ ఎదురైంది. అయితే తర్వాతి సెట్‌లో చెలరేగి ఆడిన సెరెనా అలవోక విజయాన్ని అందుకుంది. మరో పోటీలో స్విటోలినా చెమటోడ్చి నెగ్గింది. రష్యా క్రీడాకారిణి వర్వారా గ్రచేవాతో జరిగిన తొలి రౌండ్‌లో స్విటోలినా 76, 64తో విజయం సాధించింది. ఆరంభం నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోరాడారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న స్విటోలినా ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) జయకేతనం ఎగుర వేసింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి కటారినాతో జరిగిన తొలి రౌండ్‌లో 26, 62, 60తో జయభేరి మోగించింది. మరోవైపు ఏడో సీడ్ పెట్రా క్విటోవా 63, 75తో ఒసియానె డొడిన్ (ఫ్రాన్స్)ను ఓడించి ముందంజ వేసింది.

Serena Reaches 2nd round in French Open 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News