Wednesday, April 24, 2024

నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు

- Advertisement -
- Advertisement -

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ
నివాస ప్రాంతాలకు 3 కిలోమీటర్ల పరిధిలోనే కొనుగోలు చేయాలి
31వరకు అమల్లో నిబంధనలు
అంటువ్యాధుల నివారణ చట్టం కింద లాక్‌డౌన్ ఉత్తర్వులు జారీ

 Corona virus

 

మన తెలంగాణ/హైదరాబాద్: అత్యవసర సేవలు మినహా మిగతా వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ఈ మేరకు కరోనా కట్టడికి అంటువ్యాధుల నివారణ చట్టం 1897 కింద రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నివారణకు అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం అర్థరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆర్డర్స్ ఇచ్చారు. వాటికి అనుబంధంగా మరో జిఒను ను సోమవారం జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు తీసుకునేందకు అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఎపెడెమిక్ డిసిస్ యాక్ట్ 1897 ప్రకారం, విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా శిక్షార్హులు. బైక్‌లపై ఒకరు, కార్లలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణం చేయరాదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాటికి తప్ప ఇంకెవరినీ రోడ్లపైకి అనుమతించరు. సాయంత్రం 6.30 గంటల తరువాత ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లు మినహా మిగతా అన్నీ షాప్‌లు మూసేయాలి. ప్రజలు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వారి నివాస స్థలానికి మూడు కిలోమీటర్ల పరిధిలోనే కొనుగోళ్లు జరపాలి. ఇన్సురెన్సు సేవలు అందించేందుకు అనుమతి ఉంది. ఈ నిబంధనల నుంచి ఉద్యోగులకు, కొవిడ్ 19 నివారణలో పాలుపంచుకుంటున్న వ్యక్తులకు మినహాయింపు ఉంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించే అధికారులు, శాఖలపై ఎలాంటి కోర్టు వ్యాజ్యాలు వేయడానికి వీలులేదు. వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరల సరకుల అందుబాటులో ఉంచేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్, రవాణా శాఖ కమిషనర్, హైదరాబాద్ ఐజి, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ఉద్యానశాఖ సంచాలకు లు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు , లీగల్ మెట్రాలాజీ కంట్రోలర్, విజయడెయిరీ ఎం.డి ఈకమిటీలో ఉన్నారు.
జి.ఒ 45 లాక్‌డౌన్ నిబంధనలు ఇవే
n అవసరమైన, పాడైపోయే నిత్యావసర వస్తువులు, సరకుల కోసం వాడే అత్యవసర రవాణా వాహనాలకే తప్ప రాష్ట్ర సరిహద్దులు అని మూసివేత
n టిఎస్‌ఆర్‌టిసి బస్సులు, సెట్ విన్, హైదరాబాద్ మెట్రో, టాక్సీలు, ఆటో – రిక్షాలు మొదలైన అన్ని ప్రజా రవాణా సేవలు బంద్. అత్యవసర వైద్య సేవలను పొందటానికి ప్రయాణీకుల రవాణాకు అనుమతి ఉంటుంది. నిత్యావసర వస్తువులు, కార్యకలాపాలకు మాత్రం ప్రైవేట్ వాహనాల ప్రయాణాలు పరిమితం. ప్రైవేట్ ఆపరేటర్లతో సహా అన్ని అంతరాష్ట్ర బస్సు, రవాణా సేవల నిలిపివేత.
n హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షార్హులు. వారు ప్రభుత్వ ఐసోలేషన్‌కు మార్చబడుతారు.
n ప్రజలు ఎవరు ఇంట్లో ఉండి , సామాజిక దూర నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ అనుమతించబడిన కార్యకలాపాల కోసం మాత్రమే బయటకు రావాలి. ఏదైనా సందర్భంలో వాహనం నడుపుతున్న వ్యక్తిని మినహాయించి ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు అనుమతించబడరు.
n బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు వ్యక్తులు గూమికూడదు. అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కర్మాగారాలు, వర్క్ షాపులు, గోడౌన్లు మొదలైనవి వాటి కార్యకలాపాలను మూసివేస్తాయి.
n ఔషధాలు, ఎపిఐతో పాటు పప్పు, బియ్యం మిల్లులు , ఆహారం, సంబంధిత యూనిట్లు , పాల యూనిట్లు , ఫీడ్, పశుగ్రాసం యూనిట్లు వంటి అవసరమైన వస్తువుల ఉత్పత్తిలో నిమగ్నమైన తయారీ యూనిట్లు కూడా పనిచేస్తాయి.
n లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, సంస్థలు చెక్ అవుట్ కౌంటర్ల దగ్గర ఒకదానికొకటి నుండి 3 అడుగుల దూరంలో పాదాల గుర్తులను చిత్రించడం వంటి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతాల్లో పరిశుభ్రతతో పాటు హ్యాండ్ శానిటైజర్స్, హ్యాండ్ వాషింగ్ సదుపాయాల లభ్యతను నిర్ధారిస్తారు.
లాక్‌డౌన్ కింద మినహాయించినవి ఇవే
బ్యాంకులు, ఎటిఎంలు వాటి సంబంధిత కార్యకలాపాలు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్ సేవలతో సహా ఐటి, ఐటిఇఎస్
అవసరమైన వస్తువుల రవాణా, సరఫరా
ఆహారం, ఔషధ, వైద్య పరికరాలతో సహా అవసరమైన వస్తువుల ఇ – కామర్స్ (డెలివరీ), ఆహార పదార్థాలు, పచారీ వస్తువులు, పాలు, రొట్టె, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు వాటి రవాణా, అమ్మకాలు అలాగే గిడ్డంగుల కార్యకలాపాలు
రెస్టారెంట్లలో – అవె, హోమ్ డెలివరీ
హాస్పిటల్స్, ఆప్టికల్ స్టోర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఔషధాల తయారీ, వాటి రవాణా, పెట్రోల్ పంపులు, ఎల్‌పిజి గ్యాస్, ఆయిల్ ఏజెన్సీలు, వాటి గోడౌన్లు, వాటికి సంబంధించిన రవాణా కార్యకలాపాలు
ప్రైవేట్ ఏజెన్సీలు అందించే భద్రతా సేవలు
కొవిడ్ 19ని అవసరమైన సేవలను అందించే ప్రైవేట్ సంస్థలు, విమానాశ్రయాలు, సంబంధిత సేవలు
ఈ విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిందే
n జిల్లా కలెక్టరేట్, డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు , పోలీస్, ఆరోగ్య శాఖలు
n పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు
n ఫైర్, పన్ను, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
n రవాణా, స్టాంపులు, విద్యుత్, నీటి సరఫరా
n వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ మార్కెటింగ్
n పౌర సామాగ్రి, కాలుష్య నియంత్రణ మండలి, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వంటి నియంత్రణ విభాగాలు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా విధిగా పనిచేయాల్సిందే.
n లాక్‌డౌన్ వ్యవధిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే వారితో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కార్మికులు, ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు, జీతాలు చెల్లించాలి.
n లాక్‌డౌన్ కారణంగా ఎదురయ్యే కష్టాల దృష్ట్యా , రాష్ట్రంలోని మొత్తం 87.59 లక్షల ఆహార భద్రతా కార్డుదారులకు రూ.1103 కోట్లు వ్యయంతో 3.58 లక్షల టన్నుల చొప్పున వ్యక్తికి 12 కిలోల బియ్యం ఇవ్వబడుతుంది. ఇంకా అన్ని ఆహార భద్రతా కార్డు కలిగిన కుటుంబాలకు రూ.1314 కోట్ల అంచనా వ్యయంతో పప్పు, కూరగాయలు, ఉప్పు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ఖర్చులను తీర్చడానికి రూ.1500 మద్దతు ఇవ్వబడుతుంది.
n లాక్‌డౌన్ వ్యవధిలో, ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటారు.
n స్పాట్ వాల్యుయేషన్‌తో సహా అన్ని విద్యాసంస్థలు, విద్యా శాఖ కార్యకలాపాలు 2020 మార్చి 31 వరకు క్లోజ్. ఈ కాలంలో షెడ్యూల్ చేసిన అన్ని పరీక్షలు వాయిదా.
n అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు 2020 మార్చి 31 వరకు బంద్. ఈ కాలంలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఇంటి రేషన్ తీసుకోవాలి.
n మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రసవించాలని భావిస్తున్న గర్భిణీ స్త్రీలను పర్యవేక్షించడంతో పాటు వారి సుఖ ప్రసవం కోసం వైద్య సిబ్బంది సహాయం చేస్తారు .
n కొవిడ్ 19 రోగులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల లభ్యతను పెంచడానికి అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసరం కాని అన్ని శస్త్రచికిత్సలు వాయిదా.
n అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం లేదా పేరుకుపోకుండా ఉండేలా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాయి ఉదాహరణకు వరి ధాన్యం సేకరణకు గ్రామ పంచాయతీ స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇందుకోసం ఐకెపి గ్రూపులు, పిఎసిఎస్ (ప్యాక్స్), వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలను నిమగ్నం చేస్తారు. టోకెన్‌ల పద్ధతిలో వరి ధాన్యం సేకరిస్తారు.
n అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్ల మునిసిపల్ కమిషనర్లు, ఇతర సమర్థ అధికారులు లాక్‌డౌన్ ఆర్డర్స్‌తో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉండనుంది.

 

Serious action against Lock down in Corona virus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News