Home రాష్ట్ర వార్తలు పంచాయతీరాజ్‌లో సెర్ప్ విలీనం?

పంచాయతీరాజ్‌లో సెర్ప్ విలీనం?

SERPమన తెలంగాణ / హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ప్ విభాగాన్ని ఇక పంచాయతీరాజ్‌లో విలీనం చేయనున్నారు. ఈ విభాగం ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్ర మాలు ఇప్పటికే వివిధ ఇతర ప్రభుత్వ శాఖలు కూడా నిర్వహిస్తున్నాయి. దీంతో ఇతర శాఖలు నిర్వహిస్తున్న పనులు సెర్ప్ కూడా నిర్వహిం చడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ప్రభు త్వం నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అందుకే ఈ విభాగాన్ని పూర్తిగా ఎత్తివేసి పంచా యతీరాజ్‌లోనే విలీనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. తద్వారా ఆ సిబ్బందితో మిగతా కార్యక్రమాలను నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని, అది కొంత వరకు సిబ్బంది కొరత సమస్యను కూడా నివారించి నట్లు అవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెర్ప్ నిర్వహిస్తున్న కార్య క్రమాలను ఆయా ఇతర శాఖలకే పూర్తి స్థాయి లో అప్పగించడం వల్ల జవాబుదారీతనం పెరు గుతుందని భావిస్తున్నారు.

పంచాయతీ రాజ్ శాఖలో మిగతా విభాగాల పనితీరుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. పంచా యతీరాజ్ శాఖకు ఆశించిన స్థాయిలో సిబ్బంది లేక పోవడం, ఇప్పటికే సిబ్బంది కొరత వల్ల పనులు కొంత నిదానంగా జరుగు తుండడం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సెర్ప్‌లో ఉన్న సిబ్బంది తెలంగాణ రాష్ట్ర అవసరాల కంటే కూడా తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిం చింది. విభజన అనంతరం అదనపు ఉద్యోగులు ఉన్న చోట సర్దుబాటు పేరుతో ఇతర ప్రభుత్వ శాఖలకూ సిబ్బందిని బదిలీలు చేశారు. ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ నుంచి గృహ నిర్మాణ శాఖకు ఈ “సర్దుబాట్లు” ఎక్కువగా జరిగాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కె. తారక రామారావు ఇటీవల ప్రొ.జయశంకర్ యూనివర్శిటీలో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో స్థానిక సంస్థల బలోపేతం కోసం పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు సూచాయిగా చెప్పారు. సిబ్బంది ఎక్కువ ఉన్న చోట ఇతర శాఖలకు సర్దుబాటు చేయడం, తక్కువ ఉంటే ఆ మేరకు ఇతర శాఖల నుంచి తీసుకోవడమేనని చెప్పకనే చెప్పారని పలువురు విశ్లేషిస్తున్నారు.

సమగ్ర కుటుంబ సర్వేలోనూ కీలక పాత్ర
గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తాము కీలక భూమిక పోషించామని సెర్ప్ ఉద్యోగులు ఈ సంద ర్భంగా గుర్తు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్ర మాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తమను ఏ విధంగా వినియోగించు కున్నా గానీ తాము చేయడానికి సిద్ధమేనని వారు తమ సంసిద్ధతలను వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సమగ్ర కుటుంబ సర్వేనే కాదు, జనాభా లెక్కల గణన, ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ వంటి అంశాల్లో కూడా సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వం గతంలో వినియోగించుకున్న విష యాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.