Tuesday, April 23, 2024

వాలంటీర్ అనారోగ్యానికి వ్యాక్సిన్‌కు సంబంధం లేదు :‘సీరం’ వెల్లడి

- Advertisement -
- Advertisement -

Serum Institute has denied allegations made by volunteer against Vaccine

 

న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకాతో కలిసి తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైనదని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ ఈ వ్యాక్సిన్‌పై ఓ వాలంటీర్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. ఆ వాలంటీర్ అనారోగ్యానికి ఈ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. చెన్నైకు చెందిన వాలంటీర్ ఆరోపణలను సంబంధిత అధికారులు,పరిశోధకులకు తెలియచేశామని, వారు కూడా తమ పరిశీలనలో ఆ వాలంటీర్ అనారోగ్యానికి వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదని ద్రువీకరించారని సీరం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తమ వ్యాక్సిన్ వివరాలన్నీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన తరువాతనే తాము ట్రయల్స్ నిర్వహించామని సీరం పేర్కొంది. తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని సీరం సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News