Home తాజా వార్తలు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పాటు…

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పాటు…

ktr

హైదరాబాద్: నగరంలోని హెచ్‌ఐసిసిలో గురువారం రాత్రి ప్రారంభమైన బయో ఎషియా సదస్సుకు రాష్ట్ర ఐటి శాఖమంత్రి కెటిఆర్‌తో పాటు 50 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నగరంలో 19వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే మన ఫార్మాసిటి అతి పెద్దది కానుందన్నారు. బయో సైన్స్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, 10వేలకు పైగా కంపెనీలు బయోసైన్స్ రంగంలో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.రాష్ట్రంలోని జినోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతి పెద్దదని, జీనోమ్ వ్యాలీ విస్తరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐటి, లైఫ్ సైన్స్‌స్ రంగాల్లో తెలంగాణను నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.