Thursday, April 25, 2024

177 మొబైల్ రైతుబజార్లు

- Advertisement -
- Advertisement -

farmer bazaars

 

అధికారులను అభినందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్లను శనివారం ఏర్పాటు- చేశారు. దీంతో కూరగాయల ధరలు కూడా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయల ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు అందుబాటులో ఉంచడంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చర్యలను వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి అభినందించారు. ఏప్రిల్ 14 వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దృష్టిసారించాలని సూచించారు. అవసరాలకు సరిపడా ఉల్లి, ఆలుగడ్డ నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి శుక్రవారం 1800, శనివారం 6500 క్వింటాళ్లు ఉల్లిగడ్డ దిగుమతి చేసుకున్నట్లు వివరించారు. యూపి నుండి సరిపడినన్ని ఆలుగడ్డల దిగుమతి కూడా మొదలైందని తెలిపారు.

గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ఉన్నందున, ఇతర రాష్ట్రాల నుండి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. -నిత్యావసరాల కొరత అనే ప్రశ్న ఉత్పన్నం కావొద్దన్నారు. కూరగాయల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పండ్లు, కూరగాయల రవాణాకు ఆయా మార్కెట్ల అధికారుల నుండి వాహనాలకు అనుమతి పత్రాలు పొందవచ్చునన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా మార్కెట్లలో పకడ్భంధీ చర్యలు తీసుకోవడంతో పాటు, అధికారులు, సిబ్బంది కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. విధి నిర్వహణలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అన్నారు. మార్కెట్లలో రైతులకు వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు చెప్పడంతో పాటు, మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. డిమాండ్‌కు అనుకూలంగా వినియోగదారులకు కూరగాయల సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వాహనాల దగ్గర ఎక్కువ మంది గుమికుడాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిబ్బంది అందరూ శానిటైజర్,మాస్క్ లు వాడుతున్నారు. అలాగే కూరగాయల వాహనాలు హైదరాబాద్ నగరానికి రావడానికి ప్రత్యేక పాస్‌లు మంజూరు చేసినట్లు చెప్పారు. కూరగాయలతో పాటు ఆదివారం నుండి పండ్లు కూడా అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు మన తెలంగాణకు చెప్పారు. వాటికి కూడా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తొందని, పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

రాష్ట్రానికే బత్తాయిలు
ఈ సీజన్‌లో ఒక్కబత్తాయి 43వేల మెట్రిక్‌టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా 16వేల ఎకరాల విస్తీర్ణంలో వేసిన నిమ్మ ఇప్పటికే 8,800 ఎకరాల్లో సాగు చేశారు. 52 వేల 400 మెట్రిక్ నిమ్మ పంటతో పాటు 5,300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన పుచ్చకాయ దాదాపు లక్షకు పైగా చిలుకు మెట్రిక్‌టన్నులపంట దిగుబడికి సిద్ధంగా ఉంది. ఈ మొత్తాన్ని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నారు.

 

Setting up mobile farmer bazaars
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News