Home తాజా వార్తలు ద.మ. రైల్వేలో వైభవంగా సేవాదివస్

ద.మ. రైల్వేలో వైభవంగా సేవాదివస్

South central Railway

 

హైదరాబాద్ స్టేషన్‌కు ఐఎస్‌ఓ 14001 అవార్డు ప్రదానం
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛత ప్రతిజ్ఞ
లాలాగూడ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వేలో మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా సేవాదివస్ పేరిటి పలు కార్యక్రమాలకు శ్రీకారం చేశారు. జోన్ పరిధిలోని ఆరు రైల్వే డివిజన్ కేంద్రాలలో వైవిధ్యభరితంగా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సేవా దివస్ కార్యక్రమాలను జోనల్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య శ్రీకారం చేశారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బంది, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు స్వచ్ఛతా పై ప్రతిజ్ఞ నిర్వహించారు. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం ఆపడం పై వీధి నాటక ప్రదర్శనతో ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్లాస్టిక్ ఉపయోగించం అనే నినాదం పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రైల్వే ప్రయాణికులతో ప్లాస్టిక్, పరిసరాల శుభ్రత పై సంభాషించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్‌లు, పరిసరాలలో పరిశుభ్రత పాటింపు,ప్లాస్టిక్ సంచుల వినియోగానికి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్క ప్రయాణికులు సహకరించాలని సూచించారు. అలాగే రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన పరికరాలను, సదుపాయాలను, సరియైన రీతిలో ఉపయోగించేందుకు ప్రొత్సహిస్తూ జిఎం అవగాహన కల్పించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ వెటింగ్ హాల్స్, ఆహారపదార్థాల స్టాళ్ళను పరిశిలించి,ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండే విధంగా చర్యలను తీసుకొవాలని ఆయన నిర్వహకులను కొరారు.

ఈ సందర్భంగా గ్రీన్ రైల్వే స్టేషన్ ప్రచారానికి గుర్తుగా జిఎం మెక్కలను నాటారు. ఈ సందర్భంగా జిఎం గజానన్ మాల్య మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో జోన్ పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నొ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. జోన్‌లోని 35 ప్రధాన రైల్వే స్టేషన్‌లో 54 ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మిషన్లను, 28స్టేషన్లలో 35 సాలిటరీ న్యాప్కిన్, ఇన్‌సినరేటర్లు, డిస్టెన్సర్‌లను, మురుగునీటి పరిశుభ్రతా వ్యవస్థ, వ్యవర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైల్వే స్టేషన్లు, కార్యాలయ, భవనాలు, వర్క్‌షాపు, శిక్షణా సంస్థలకు గ్రీన్ రేటింగ్ సర్టిఫికేషన్ సాధించడానికి ఉద్యమ రూపంలో ప్రయత్నం సాగుతుందన్నారు.

హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు దక్కిన ఐఎస్‌ఓ 14001 ప్రదానం
దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ప్రతిష్టాత్మకంగా క్లిన్ అండ్ గ్రీన్, ప్లాస్టిక్ వాడకం చర్యల పై హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు ఐఎస్‌ఓ14001 సర్టిఫికేషన్ అవార్డు ప్రధానం దక్కిందని జిఎం వివరించారు. జోన్‌లోని అన్ని డివిజన్లలో నర్సీలను అభివృద్ధి చేయడానికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటామని ఆయన తెలిపారు.

బీబీనగర్-నల్లపాడుల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
జాతిపితా గాంధీ150వ జయంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బీబీనగర్-నల్లపాడుల మధ్య విద్యుదీకరించిన రైల్వే మార్గంలో హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును పర్యావరణ హితంగా అన్ని సదుపాయాలతో బుధవారం ప్రారంభించారు.

రైల్వే ఆసుప్రతిలో రక్త దాన శిబిరం
దక్షిణ మధ్య రైల్వే సేవా దివస్ కార్యక్రమాలో భాగంగా లాలాగూడలోని రైల్వే సెంట్రల్ ఆసుపత్రి నందు నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని జిఎం.గజానన్ మాల్య ప్రారంభించారు. ఈ మేరకు ఆయన రక్తదానం చేశారు.

Seva Divas in South central Railway