Home ఖమ్మం గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్

గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్

Accused Arrested

 

ఖమ్మం : ఇటీవల ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. జిల్లా పోలీస్ కమిషనర్ తఫణ్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం… రఘునాథపాలెం మండలంలోని హర్యతండా సమీపంలోని జనవరి 24వ తేదీన రాత్రి సుమారు 11 గంటల సమయంలో బద్యాతండాకు చెందిన ఓ వివాహిత(36)ను ఆమె ఇంటి నుంచి బలవంతంగా హర్యాతండా, సుఖినితండా గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు పత్తి చేలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడారు.

 హర్యతండా, సుఖిని తండాకు చెందిన అజ్మీర నాగేశ్వరరావు (24), భూక్యా సునీల్ (26), బానోతు ఉపేందర్ (25) అత్యాచారానికి పాల్పడగా అంగోతు కళ్యాణ్ (23) అత్యాచారం చేయటానికి సిద్ధమవుతుండగా పెట్రో కారు హారన్ విన్పించడంతో వారు పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో నింధితులు పారిపోతుండగా కైకొండాయిగూడెం క్రాస్ రోడ్డు వద్ద సిఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేసి వారి నుంచి ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హర్యాతండా వద్ద వదిలిన నిరోధ్ బాక్స్, మోటర్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులంతా వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటారని సిపి తెలిపారు.

Seven accused arrested in Woman gang rape case