Home దునియా సప్తవర్ణాల మేళవింపు

సప్తవర్ణాల మేళవింపు

 

సప్తవర్ణాల మేళవింపుగా దర్శనమిస్తున్న ఈ జలధారను సెవెన్‌ఫాల్స్‌గా పిలుస్తారు. కొండమీద నుంచి అంచెలంచెలుగా కిందకుపడుతూ మొత్తం ఏడు విభిన్న జలపాతాలు ఒక వరుసలో దుముకుతున్నట్టుగా కనిపించడం దీని ప్రత్యేకత. అమెరికాలోని కొలరొడోలో ఉన్న ఈ జలధారలోని ఒక్కో జలపాతానికీ ఒక్కో పేరుంది. నూట ఎనభై ఒక్క అడుగుల ఎత్తున్న ఈ జలపాతాల్ని పై దాకా చూసేందుకు మెట్ల ఏర్పాటు ఉంటుంది. నీటిమీద రకరకాల రంగులను ప్రతిబింబిస్తూ చీకటివేళల్లో ఇక్కడ జరిగే లైట్‌షో ఓ ప్రత్యేక ఆకర్షణ.

 

Seven Colour Falls in Colorado in America