- Advertisement -
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో ఈ శీతాకాలంలో -3.2 డిగ్రీల అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. కాగా ఈ చలి తీవ్రత తట్టుకోలేక ఏడుగురు మృతి చెందారు. విపరీతంగా మంచు కురుస్తుండగా సిమ్లాలో సాధారణ జీవనం స్థంభించింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.
- Advertisement -