Tuesday, March 21, 2023

2018లో ఏడుగురు జడ్జిల రిటైర్

- Advertisement -

JUDGE

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 1 తర్వాత ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తుల కొరత ఉంది. పైగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించేందుకు చేసిన సిఫార్సులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి 1న న్యాయమూర్తి అమితవ రాయ్ పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత మే 4న న్యాయమూర్తి రాజేశ్ అగర్వాల్ కూడా పదవి నుంచి తొలగనున్నారని సుప్రీంకోర్టు వెబ్‌సైట్, న్యాయమంత్రిత్వ శాఖ తెలిపాయి. న్యాయమూర్తి రాయ్‌కు శుక్రవారమే చివరి పనిదినం కానున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు హోలి పర్వదిన సెలవుల తర్వాత మళ్లీ మార్చి 5నే తెరుచుకోనున్నది. సుప్రీంకోర్టులో అతంత సీనియర్ అయిన న్యాయమూర్తి జె. చలమేశ్వర్ రావు జూన్ 22న పదవి నుంచి విరమించనున్నారు. తర్వాత జులై 6న న్యాయమూర్తి ఆదర్శ్ గోయల్ పదవి నుంచి దిగిపోనున్నారు. ఒక భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత నవంబర్ 29న న్యాయమూర్తి కురియన్ జోసఫ్, డిసెంబర్ 30న న్యాయమూర్తి మదన్ బి లోకుర్ పదవీ విరమణ చేయనున్నారు. ఇలా వరుసగా న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడం వల్ల, ఇప్పటికే ఆరుగురు జడ్జీల కొరత కారణంగా కొత్తవారి పేర్లను నామినేట్ చేసే ఒత్తిడి కొలీజియంపై పెరుగనున్నది. అంతేకాక కొత్త న్యాయమూర్తుల నియుక్తి ప్రభుత్వం వేగిరం చేయాల్సి ఉంటుంది. సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తర్‌ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల ప్రభుత్వానికి వారి పేర్లను పంపింది. అయితే ఆ సిఫార్సుల పరిశీలనను ప్రభుత్వం ఇంకా ఆమోదించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News