Thursday, July 17, 2025

నేపాల్ రోడ్డు దుర్ఘటనలో ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లోని బాగ్‌మతి ప్రాంతంలో శనివారం ఓ విద్యుత్తు వాహనాన్ని బస్సు ఢీకొనడంతో కనీసం ఏడుగురు చనిపోయారు, 25 మంది ఇతరులు గాయపడ్డారు. బస్సు ధంగధి నుంచి కకర్‌భిత్తకు వెళుతుండగా చిట్వాన్ జిల్లాలోని హైవేలో ఉదయం 10.15 గంటలకు విద్యుత్తు వాహనాన్ని ఢీకొంది. గాయపడిన వారిని వెంటనే పోలీసులు వివిధ ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. వారిలో కొందరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని సమాచారం. ప్రమాదంపై దర్యాప్తును ఆరంభించినట్లు చిట్వాన్ పోలీసు ప్రతినిధి రవీంద్ర ఖనల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News