Home తాజా వార్తలు రాష్ట్రానికి కొత్తగా ఏడుగురు ఐఎఎస్‌లు

రాష్ట్రానికి కొత్తగా ఏడుగురు ఐఎఎస్‌లు

IAS

ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర సిబ్బంది,శిక్షణావ్యవహారాల శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ 2109 బ్యాచ్ అభ్యర్థులకు క్యాడర్ కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది,శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులకు ఈ మేరకు శిక్షణా వ్యవహారాల శాఖ సమాచారం అందించింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏడుగురు ఐఏఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. తెలంగాణకు కొత్తగా కెటాయించిన ఐఏఎస్‌ల్లో కర్ణాటి వరుణ్ రెడ్డి, చిత్రామిశ్రా, పాటిల్ హేమంత్ కేశవ్, గరిమా గర్వా ల్, దీపక్ తివారి, అంకిత్, ప్రతిమాసింగ్ ఉన్నారు. అయితే ఇతర రాష్ట్రా ల క్యాడర్‌కు వెళ్లనున్న తెలంగాణ ఐఏఎస్‌ల్లో(కొత్తగా శిక్షణ పొందినవారు) పశ్చిమ బెంగాల్‌కు మహ్మద్ అబ్దుల్ షాహిద్, త్రిపురకు బి.వైష్ణవి, చత్తతీస్‌ఘడ్‌కు నీలం లలితాఆదిత్య కు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది,శిక్షణావ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

Seven new IAS Transfer To Telangana