Wednesday, April 24, 2024

డ్రగ్స్ కేసులో ఏడుగురు టోనీ అనుచరుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Seven Tony followers arrested in drugs case
నిందితులతో టోనీకి వ్యాపార సంబంధాలు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ అనుచరులను మరో ఏడుగురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల కస్టడీలో ఉన్న డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. టోనీని కస్టడీకి తీసుకుని 4 రోజులుగా పోలీసులు ప్రశ్నిస్తుస్తున్నారు. టోనీ నుంచి పోలీసులు కొన్ని కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. టోనీ చెప్పిన వివరాలతో అనతికాలంలో మరికొందరు ఏజెంట్లను అరెస్టు చేసే అవకాశముంది. ఇదిలావుండగా డ్రగ్స్ కేసులో బుధవారంతో టోనీ కస్టడీ గడువు ముగియనుంది. ముంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్ నిర్వహిస్తున్న నైజీరియన్ టోనీని విచారిస్తున్న కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో టోనీ కోట్లు గడించినట్లు దర్యాప్తులో తేల్చారు. అతని వాట్సాప్ చాటింగ్ ద్వారా చాలామందితో సంబంధాలున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

కానీ వాట్సాప్ సంభాషణలన్నీ కూడా డిలీట్ చేయడంతో వాటిని రిట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.డ్రగ్స్ కేసులో టోనీకి వ్యాపార వేత్తలకు ఏజెంట్లుగా పనిచేసిన10 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వివిధ రంగాలకు చెందిన పలువురిని పోలీసులు గుర్తించారు. అయితే టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్ ఫోర్స్ బృందాలు అతని కాల్ డేటా, డార్క్ నెట్ వ్బ్సైట్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా పరీశీలిస్తున్నారు. మూడు బ్యాంక్ ఎకౌంట్స్ ట్రాన్సెక్షన్స్ పరిశీలించిన పోలీసులు టోనీని మరోసారి కస్టడీలోకి కోరే అవకాశం ఉంది.

వెలుగులోకి కీలక విషయాలు 

డ్రగ్స్ కేసులో టోనీని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా స్టార్ బాయ్ ఎక్కడివాడు అనే కోణంలో దర్యాప్తు జరిపారు. ఈక్రమంలో ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకు టోనీ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లను టోనీ తీసుకున్నాడని, స్టార్ బాయ్ అండర్ గ్రౌండ్‌లో ఉండి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని విచారణలో వెలుగుచూసింది. స్టార్ బాయ్ 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, రెండుసార్లు స్టార్ బాయ్‌ను టోనీ నేరుగా కలినట్లు విచారణలో తేలింది. స్టార్ బాయ్ నెట్‌వర్క్‌నే టోనీ వాడుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయా వ్యాపారవేత్తలకు కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు గుర్తించారు. కాగా డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలు ఎవరూ కూడా టోనీకి నగదు చేరవేయకుండా కొరియర్స్‌కే డబ్బులు ఇచ్చేవారని తేలింది. చిన్న షాపుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా టోనీకి కొరియర్స్ డబ్బులు పంపేవారని, ప్రతి నెలకు 20 గ్రాముల చొప్పున కొకైన్‌ను వ్యాపారవేత్తలు తెప్పించుకున్నారని తేలడంతో ఆయా వ్యాపారవేత్తల డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News