Home తాజా వార్తలు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన ఏడుగురికి జైలు శిక్ష

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన ఏడుగురికి జైలు శిక్ష

 Seven were Jailed for Driving the Phone

హైదరాబాద్ : ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిన ఏడుగురికి జైలు శిక్ష పడింది. హైదరాబాద్ టోలీచౌకి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం… చరవాణిలో మాట్లాడుతూ  డ్రైవింగ్ చేసిన  వాహనదారులకు కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించినట్టు తెలిపారు. గత నాలుగు రోజులుగా టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తనిఖీల్లో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన వారిని మంగళవారం న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా ఏడుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ 12వ కోర్టు న్యాయమూర్తి సామయ్యచారీ తీర్పునిచ్చినట్లు సిఐ పేర్కొన్నారు.